రంజన్ గొగోయ్‌కు రాజ్యసభ !
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు రాజ్యసభకు నామినేట్ చేశారు. నామినేటేడ్ కోటాలో ఆయన్ని నామినేట్ చేశారు. ఈమేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రంజన్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఏడాది నవంబర్ 17న పదవి విరమణ చేశారు, సరిగ్గా రిటైర్‌మెంట్‌కు ముందుకు ఆయన చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. వాటిలో ముఖ్యమైంది. అయోధ్య తీర్పు. ఆ తర్వాత రఫెల్ స్కామ్‌లో మోదీ ప్రభుత్వానికి […]
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు రాజ్యసభకు నామినేట్ చేశారు. నామినేటేడ్ కోటాలో ఆయన్ని నామినేట్ చేశారు. ఈమేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రంజన్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఏడాది నవంబర్ 17న పదవి విరమణ చేశారు, సరిగ్గా రిటైర్‌మెంట్‌కు ముందుకు ఆయన చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. వాటిలో ముఖ్యమైంది. అయోధ్య తీర్పు. ఆ తర్వాత రఫెల్ స్కామ్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇచ్చారు.
అంతకుముందు సుప్రీంకోర్టులో ఈయనపై ఓ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అయితే ముగ్గురు సభ్యుల కమిటీ ఈయనకు క్లీన్ చీట్ ఇచ్చింది. రిటైర్‌మెంట్ కు ముందు కొంతమంది జడ్జీలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. అయితే ఆ తర్వాత సర్దుకున్నారు. ఇప్పుడు ఈయనకు రాజ్యసభ పదవిని వరించింది.
మొత్తానికి క్రీడలు, వివిధ రంగాల్లోని ప్రముఖులను ఇంతకు ముందు రాష్ట్రపతి పెద్దల సభకు నామినేట్ చేసేవారు. దశాబ్దాల కిందట సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా పదవీ విరమణ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీ అయ్యారు. ఆతర్వాత మాజీ న్యాయమూర్తుల్లో సదాశివం రిటైర్‌మెంట్ తర్వాత కేరళ గవర్నర్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది. రాజకీయ, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న రేఖలు చెరిగిపోతున్నాయి. బీజేపీ ప్రభుత్వంలో ఈ రెండు నియమాకాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.