గడువు ముగుస్తోంది.... త్వరగా అనుసంధానం చేసుకోండి
మీకు పాన్ కార్డు ఉందా? ఉంటే.. ఆధార్ తో అనుసంధానం చేసుకున్నారా? లేదంటే.. త్వరగా ఆ పని పూర్తి చేయండి. ఈ నెలాఖరుతో.. అంటే మార్చి 31తో ఆధార్ – పాన్ అనుసంధానం గడువు ముగియనుంది. ఇప్పటికే చాలాసార్లు గడువును పొడిగించిన ఆదాయపన్ను విభాగం.. ఈ సారి మాత్రం మళ్లీ అలాంటి అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. అందుకే.. పాన్ కార్డు హోల్డర్లంతా.. త్వరగా ఆధార్ తో లింక్ చేసుకుంటే మంచిది. ఈ ప్రక్రియకు ఎక్కడెక్కడో తిరగాల్సిన […]
మీకు పాన్ కార్డు ఉందా? ఉంటే.. ఆధార్ తో అనుసంధానం చేసుకున్నారా? లేదంటే.. త్వరగా ఆ పని పూర్తి చేయండి. ఈ నెలాఖరుతో.. అంటే మార్చి 31తో ఆధార్ – పాన్ అనుసంధానం గడువు ముగియనుంది. ఇప్పటికే చాలాసార్లు గడువును పొడిగించిన ఆదాయపన్ను విభాగం.. ఈ సారి మాత్రం మళ్లీ అలాంటి అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. అందుకే.. పాన్ కార్డు హోల్డర్లంతా.. త్వరగా ఆధార్ తో లింక్ చేసుకుంటే మంచిది.
ఈ ప్రక్రియకు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా.. ఐటీ శాఖ అవకాశాలు కల్పించింది. UIDPAN (స్పేస్) ఆధార్ నంబర్ (స్పేస్) 10 అంకెల పాన్ నంబర్ ను టైప్ చేసి.. 567678, 56161 నంబర్లలో ఏదో ఒకదానికి పంపించవచ్చు. అలా కాదనుకుంటే.. www.incometaxindiaefiling.gov.in సైట్ ను విజిట్ చేయడం ద్వారా పాన్, ఆధార్ లింక్ పూర్తి చేయవచ్చు.
అవసరమైతే.. బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ, ఎన్ఎస్ డీఎల్, యూటీఐటీఎస్ఎల్ పాన్ సేవా కేంద్రాల్లోనూ ఈ పని చేసుకోవచ్చు. గడువులోగా.. ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులు ఆ తర్వాత చెల్లవని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అందుకే.. ప్రజలారా మేల్కొండి.. అప్రమత్తం కండి. తర్వాత.. ఆర్థిక పరమైన లావాదేవీల్లో సమస్యలు కొని తెచ్చుకోకుండా.. ఆధార్, పాన్ ను లింకప్ చేసుకోండి అని ప్రచారం చేస్తున్నారు.