Telugu Global
NEWS

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కు కరోనా అనుభవం

14 రోజులపాటు మెక్ లెంగ్లాన్ కు భార్యదూరం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మిషెల్ మెక్ లెంగ్లాన్ కు పరోక్షంగా కరోనా వైరస్ దెబ్బ తగిలింది. పాకిస్థాన్ లో కొద్దిగంటల క్రితమే ముగిసిన 2020 పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీలో పాల్గొని స్వదేశం న్యూజిలాండ్ కు తిరిగివెళ్లిన మిషెల్ కు అనుకోని షాక్ తగిలింది. కొద్దివారాలుగా పాకిస్థాన్ లోని కరాచీ, లాహోర్ లాంటి నగరాలలో క్రికెట్ ఆడుతూ గడిపిన మిషెల్ మెక్ లెంగ్లాన్..న్యూజిలాండ్ లోని సొంతింటికి వెళ్లిన […]

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కు కరోనా అనుభవం
X
  • 14 రోజులపాటు మెక్ లెంగ్లాన్ కు భార్యదూరం

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మిషెల్ మెక్ లెంగ్లాన్ కు పరోక్షంగా కరోనా వైరస్ దెబ్బ తగిలింది. పాకిస్థాన్ లో కొద్దిగంటల క్రితమే ముగిసిన 2020 పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీలో పాల్గొని స్వదేశం న్యూజిలాండ్ కు తిరిగివెళ్లిన మిషెల్ కు అనుకోని షాక్ తగిలింది.

కొద్దివారాలుగా పాకిస్థాన్ లోని కరాచీ, లాహోర్ లాంటి నగరాలలో క్రికెట్ ఆడుతూ గడిపిన మిషెల్ మెక్ లెంగ్లాన్..న్యూజిలాండ్ లోని సొంతింటికి వెళ్లిన సమయంలో… ఇంటితలుపుకు అంటించిన లేఖ చూసుకొని నవ్వాలో…ఏడ్వాలో తెలియని పరిస్థితిలో చిక్కుకొన్నాడు.

తన భార్యలేఖ చదువుకొని ప్రారంభంలో ఇబ్బంది పడినా…ఆ తర్వాత చిరునవ్వుతో సరిపెట్టుకొన్నాడు. 14 రోజులపాటు తాను అమ్మానాన్నలతో గడపడానికి పుట్టింటికి వెళుతున్నానని… కరోనా వైరస్ లేదని తేలితే …ఆ తర్వాతే ఇంటికి తిరిగి వస్తానని మిషెల్ భార్య తాను రాసిన లేఖలో స్పష్టం చేసింది.

కరోనా వైరస్ భయంతో విదేశాలకు వెళ్లివచ్చినవారిని…14 రోజులపాటు క్వారెంటైన్ లో ఉంచి…ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందిలేదని ప్రకటిస్త్త్తూ వస్తున్నారు.

పాపం నూజిలాండ్ క్రికెటర్ మిషెల్ మెక్ లెంగ్లాన్ కు మాత్రం… కరోనావైరస్ పుణమ్యా అంటూ… సొంతిల్లే క్వారెంటైన్ కావడం, రెండువారాలపాటు భార్యా వియోగం కలగడం… ఓ విచిత్రమైన అనుభవంగా మిగిలిపోక తప్పదు. భార్య లేదా భర్త..ప్రాణాలు ఎవరివైనా ఒక్కటే కదా మరి…. అనుకోక తప్పదు.

First Published:  17 March 2020 2:14 AM IST
Next Story