Telugu Global
Cinema & Entertainment

కరోనాపై ఆర్ఆర్ఆర్ హీరోల పోరాటం

హీరోలకు కూడా సామాజిక బాధ్యత ఉండాలి. ఎప్పటికప్పుడు కొంతమంది హీరోలు ఈ దిశగా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోలు ముందుకొచ్చారు. ప్రపంచాన్ని కమ్మేస్తున్న కరోనాపై అవగాహన కల్పించేందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వీడియో రిలీజ్ చేశారు. కొమరం భీమ్ గెటప్ లో ఎన్టీఆర్, సీతారామరాజు గెటప్ లో ఉన్న రామ్ చరణ్.. కలిసి ఈ వీడియో చేశారు. కరోనాపై అనవసర ఆందోళనలు వద్దని చెప్పే ప్రయత్నం చేశారు. పనిలోపనిగా కరోనాను […]

కరోనాపై ఆర్ఆర్ఆర్ హీరోల పోరాటం
X

హీరోలకు కూడా సామాజిక బాధ్యత ఉండాలి. ఎప్పటికప్పుడు కొంతమంది హీరోలు ఈ దిశగా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోలు ముందుకొచ్చారు. ప్రపంచాన్ని కమ్మేస్తున్న కరోనాపై అవగాహన కల్పించేందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వీడియో రిలీజ్ చేశారు.

కొమరం భీమ్ గెటప్ లో ఎన్టీఆర్, సీతారామరాజు గెటప్ లో ఉన్న రామ్ చరణ్.. కలిసి ఈ వీడియో చేశారు. కరోనాపై అనవసర ఆందోళనలు వద్దని చెప్పే ప్రయత్నం చేశారు. పనిలోపనిగా కరోనాను ఎదుర్కొనేందుకు ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలో సూచించారు.

ఇప్పటికే కరోనాపై అవగాహన కల్పించేందుకు కొంతమంది నటీనటులు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలామంది హీరోలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. అయితే ఎన్టీఆర్, చరణ్ లా ఇలా వీడియో రిలీజ్ చేసిన వాళ్లు మాత్రం లేరు.

మరోవైపు కరోనా ప్రభావంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే షూటింగ్ కు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతోంది. రిలీజ్ డేట్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇలాంటి టైమ్ లో కరోనా కారణంగా మరోసారి షూట్ లేటైతే అది విడుదల తేదీపై ప్రభావం చూపిస్తుంది. అందుకే రాజమౌళి ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాడు.

First Published:  17 March 2020 7:20 AM IST
Next Story