కర్నూలు టీడీపీకి మరో షాక్... వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే ?
కర్నూలు జిల్లాలో టీడీపీ కి మరో షాక్ తగలబోతోంది. వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి చేరుతారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో చేరికపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. బీసీ జనార్ధన్‌రెడ్ది ప్రస్తుతం కర్నూలు జిల్లా బనగానపల్లె టీడీపీ ఇంచార్జ్. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన కొంత సైలెంట్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల […]
కర్నూలు జిల్లాలో టీడీపీ కి మరో షాక్ తగలబోతోంది. వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి చేరుతారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో చేరికపై ఆయనతో చర్చించినట్లు సమాచారం.
బీసీ జనార్ధన్‌రెడ్ది ప్రస్తుతం కర్నూలు జిల్లా బనగానపల్లె టీడీపీ ఇంచార్జ్. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన కొంత సైలెంట్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సోమవారం హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. వైసిపిలో బీసీ జనార్ధన్‌రెడ్డి చేరడం లాంఛనప్రాయమే అని ఆయన అనుచరులు అంటున్నారు.
బనగానపల్లె ఎమ్మెల్యేగా ప్రస్తుతం కాటసాని రామిరెడ్డి ఉన్నారు, ఈయన వైసీపీ తరపున ఎన్నికయ్యారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాటసాని గెలుపుకోసం చల్లారామకృష్ణారెడ్డి, బిజ్జం పార్థసారథిరెడ్డి కృషి చేశారు. దీంతో చల్లాకు ఎమ్మెల్సీని చేశారు జగన్. బిజ్జంకు ఏదో ఒక నామినేటేడ్ పదవి ఇస్తారని తెలుస్తోంది. బనగానపల్లెలో వైసీపీ విజయం కోసం పనిచేసిన యర్రగొండ వెంకటేశ్వరరెడ్డిని జడ్పీ ఛైర్మన్ పదవి వరిస్తుందని సమాచారం.
బనగానపల్లె వైసీపీలో నలుగురు లీడర్లు ఉన్నారు. ఇప్పుడు బీసీ జనార్ధన్ రెడ్డి కూడా రావడంతో అక్కడ టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది.