Telugu Global
NEWS

విశాఖ తీరం... ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం

సాగర తీరాన్ని మరింత సుందరంగా.. అభివృద్ధికి కేంద్రంగా మార్చే చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఫార్మా హబ్ గా మారిన విశాఖలో.. మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఏకంగా.. 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 39 మెగా ఇండస్ట్రియల్ యూనిట్లను.. విశాఖ కేంద్రంగా నెలకొల్పాలని భావిస్తోంది. అవసరమైతే.. ఇతర పట్టణాల్లో ఉప కేంద్రాలు ఏర్పాటు చేసి… వాటిని విశాఖకు అనుసంధానం చేసి.. అభివృద్ధి సాధించాలన్న ప్రణాళిక అమలు […]

విశాఖ తీరం... ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం
X

సాగర తీరాన్ని మరింత సుందరంగా.. అభివృద్ధికి కేంద్రంగా మార్చే చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఫార్మా హబ్ గా మారిన విశాఖలో.. మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఏకంగా.. 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 39 మెగా ఇండస్ట్రియల్ యూనిట్లను.. విశాఖ కేంద్రంగా నెలకొల్పాలని భావిస్తోంది. అవసరమైతే.. ఇతర పట్టణాల్లో ఉప కేంద్రాలు ఏర్పాటు చేసి… వాటిని విశాఖకు అనుసంధానం చేసి.. అభివృద్ధి సాధించాలన్న ప్రణాళిక అమలు చేస్తోంది.

ఈ విషయాన్ని విశాఖ వేదికగా నిర్వహించిన ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానమైన అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే విశాఖను పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేసి.. అభివృద్ధి వికేంద్రీకరణను అక్కడి నుంచే మొదలు పెట్టారని తెలిపారు.

972 కిలోమీటర్ల తీర ప్రాంతం.. ఒక లక్షా 25 వేల కిలోమీటర్ల సుదీర్ఘమైన రహదారుల వ్యవస్థ.. రాష్ట్రానికి ఎంతో బలమని.. వాటి ఆధారంగా పారిశ్రామిక అభివృద్ధిని విస్తృతంగా సాధించవచ్చని.. విజయసాయి రెడ్డి చెప్పారు.

ఈ క్రమంలోనే.. విశాఖ ఎనర్జీ హబ్ గా ఏటికేడు రెట్టింపు వృద్ధి సాధిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే.. ప్రతిపాదిత 39 ఇండస్ట్రియల్ యూనిట్లను వినియోగిస్తూ.. ఎక్కడి ఖనిజాలు లభిస్తున్నాయో అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసి వ్యాపార అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

ఈ లెక్కన.. విశాఖ కేంద్రంగా అభివృద్ధికి జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మామూలుగా లేవు, చాలా ముందుచూపుతో ఉన్నాయన్న చర్చ పారిశ్రామిక వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

First Published:  16 March 2020 1:58 AM IST
Next Story