Telugu Global
NEWS

ఏపీలో కరోనా లేదు.. ఎన్నికలు నిర్వహించండి " సీఎస్ లేఖ

ఏపీలో కరోనా వైరస్ వల్ల ప్రమాదం జరగవచ్చనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నీలం సాహ్ని కమిషనర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి లేదని.. పరిస్థితి అదుపులోనే ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు యధావిధిగా చేపట్టాలని.. దానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ఆమె లేఖలో కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర […]

ఏపీలో కరోనా లేదు.. ఎన్నికలు నిర్వహించండి  సీఎస్ లేఖ
X

ఏపీలో కరోనా వైరస్ వల్ల ప్రమాదం జరగవచ్చనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నీలం సాహ్ని కమిషనర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి లేదని.. పరిస్థితి అదుపులోనే ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికలు యధావిధిగా చేపట్టాలని.. దానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ఆమె లేఖలో కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆమె వెల్లడించారు. పోలింగ్ రోజు జనం గుమికూడకుండా ఎలాగో 144 సెక్షన్ విధిస్తారు కదా.. ఇక లైన్లో నిలబడే వాళ్లు కాస్త జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు.

మరో నాలుగు వారాల పాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. వెంటనే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే చేపట్టాలని నీలం సాహ్ని కోరారు.

First Published:  16 March 2020 6:01 AM IST
Next Story