ఈ ఆరోపణలకు చంద్రబాబు అండ్ కో సమాధానం ఏంటో?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాక… ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ… సీఎం జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సామాజిక వర్గానికే చెందిన వ్యక్తిని.. చంద్రబాబు తన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారని ఆరోపించారు. ఈ విషయంలో నిజానిజాలు ఆరా తీస్తే.. అది నిజమే అన్న విషయం కన్ఫమ్ అయ్యింది. మరో కీలక విషయం ఏంటంటే.. చంద్రబాబు ప్రభుత్వమే ఉన్నప్పుడు.. ఇదే నిమ్మగడ్డ […]
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాక… ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ… సీఎం జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సామాజిక వర్గానికే చెందిన వ్యక్తిని.. చంద్రబాబు తన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారని ఆరోపించారు. ఈ విషయంలో నిజానిజాలు ఆరా తీస్తే.. అది నిజమే అన్న విషయం కన్ఫమ్ అయ్యింది.
మరో కీలక విషయం ఏంటంటే.. చంద్రబాబు ప్రభుత్వమే ఉన్నప్పుడు.. ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూతురు.. నిమ్మగడ్డ శరణ్యను ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు అసోసియేట్ డైరెక్టర్ గా నియమించారన్న వార్త.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో గుప్పుమంటోంది. జగన్ చేసిన ఆరోపణలను గమనిస్తే.. అందులో నిజం ఉన్నట్టే అనిపిస్తోందని.. వైసీపీ నాయకులు అంటున్నారు.
ఎన్నికల వాయిదాపై ఆవేదనతో జగన్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడిన టీడీపీ నాయకులు.. ఈ ఆరోపణలకు ఏం బదులు చెబుతారని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించిన బాధ్యతల్లో ఉన్న వారిపై వ్యాఖ్యలు సబబు కాదని ఇప్పటికే అంటున్న నేతలు.. మరి శరణ్యకు చంద్రబాబు హయాంలో దక్కిన బాధ్యతల గురించి ఏమంటారని నిలదీస్తున్నారు. సన్నిహితులు కాకుంటే.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి.. ఒకే ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు ఎలా దక్కుతాయని అడుగుతున్నారు.
ఈ ప్రశ్నలకు.. టీడీపీ నేతలు సమాధానం చెబుతారా.. లేదంటే.. ఎదురుదాడి కొనసాగిస్తారా అన్నది చూడాలి.