వైసీపీకి దగ్గరవుతున్న టాలీవుడ్.. ఆధారం ఇదే!
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అయినప్పుడు చాలా మంది సినీ నటులు కనీసం శుభాకాంక్షలు కూడా తెలపలేదు. ఇండస్ట్రీ పెద్దలు అనుకునేవాళ్లు కూడా.. అసలు ఎన్నికల ప్రస్తావన తీయలేదు. చాలామంది చంద్రబాబుకు దగ్గరి వాళ్లు కాబట్టి.. అలా సైలెంట్ గా ఉన్నారేమో అని ప్రజలు కూడా సరిపెట్టుకున్నారు. కానీ.. కాలం మారింది. టాలీవుడ్ తారల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో 4 పెద్ద కుటుంబాలు.. జగన్ కు దగ్గరగా వచ్చిన సందర్భం ఇప్పుడు చర్చే […]
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అయినప్పుడు చాలా మంది సినీ నటులు కనీసం శుభాకాంక్షలు కూడా తెలపలేదు. ఇండస్ట్రీ పెద్దలు అనుకునేవాళ్లు కూడా.. అసలు ఎన్నికల ప్రస్తావన తీయలేదు. చాలామంది చంద్రబాబుకు దగ్గరి వాళ్లు కాబట్టి.. అలా సైలెంట్ గా ఉన్నారేమో అని ప్రజలు కూడా సరిపెట్టుకున్నారు. కానీ.. కాలం మారింది. టాలీవుడ్ తారల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
సినీ ఇండస్ట్రీలో 4 పెద్ద కుటుంబాలు.. జగన్ కు దగ్గరగా వచ్చిన సందర్భం ఇప్పుడు చర్చే అవసరం లేకుండా జనానికి అర్థమవుతోంది. అదెలాగంటే.. ఎన్నికలకు ముందే నాగార్జున.. జగన్ మధ్య మంచి స్నేహం ఉంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ లెక్కన.. చాలా కాలంగానే వైఎస్, అక్కినేని కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధం.. జగన్ అధికారంలోకి వచ్చాక మరింత బలపడి ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం.
తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి. సైరా విడుదల సందర్భంగా.. స్వయంగా జగన్ ను కలిసి సినిమాను చూడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తర్వాత.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ విడుదల సందర్భంగా జగన్ ను వెనకేసుకొచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు బహిరంగ మద్దతు తెలిపి.. ప్రభుత్వానికి దగ్గరయ్యారు. ఏనాడూ జగన్ నిర్ణయాలను కానీ.. ప్రభుత్వ విధానాలను కానీ చిరంజీవి తప్పుబట్టింది లేదు.
ఇక.. దగ్గుబాటి కుటుంబం. ఇన్నాళ్లూ వైసీపీకి, ఆ కుటుంబానికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఎవరూ తెలుసుకోలేకపోయారు. కానీ.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. ఈ రెండు కుటంబాలు స్నేహితులే అని అర్థమైంది. విక్టరీ వెంకటేష్ కు బంధువు.. వరసకు సోదరి అయిన తాళ్లూరి స్వరూపారాణి నెల్లూరు జిల్లా దగదర్తికి చెందిన వారు. ఆమె.. వైపీసీ నుంచి జడ్పీటీసీగా నామినేషన్ వేయండం.. వారి సంబంధాన్ని తెలియజేస్తోంది.
నాలుగో కుటుంబానికి వస్తే.. మంచు మోహన్ బాబు. జగన్ ను ఎన్నోసార్లు బహిరంగంగానే పొగిడారు. చిన్నవాడైనా కూడా.. జగన్ గురించి చాలా మర్యాదగా మాట్లాడారు. ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. మంచు విష్ణు భార్య వెరోనిక.. వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.
ఇక నందమూరి కుటుంబం నుంచి అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ బహిరంగంగానే జగన్ కు మద్ధతు పలికారు, పార్టీ కండువా కూడా కప్పుకున్నారు.
ఈ లెక్కన.. ఇండస్ట్రీలోని దాదాపు పెద్ద కుటుంబాలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టే లెక్క.