Telugu Global
NEWS

మహేంద్రసింగ్ ధోనీ పీఛే ముడ్

చెన్నై నుంచి రాంచీకి తిరుగుటపా కరోనా వైరస్ హెచ్చరికతో ప్రాక్టీస్ కు విరామం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రీ-ఎంట్రీ ఎప్పుడాఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. గత ఏడుమాసాలుగా అంతర్జాతీయ క్రికెట్ కు తనకుతానుగా దూరమై కుటుంబవ్యవహారాలకు మాత్రమే పరిమితమైన ధోనీ…ఐపీఎల్ 13వ సీజన్ ద్వారా రీ-ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ లో తన హోంగ్రౌండ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా…మార్చి 3 నుంచి సురేష్ రైనా, అంబటి రాయుడు లాంటి […]

మహేంద్రసింగ్ ధోనీ పీఛే ముడ్
X
  • చెన్నై నుంచి రాంచీకి తిరుగుటపా
  • కరోనా వైరస్ హెచ్చరికతో ప్రాక్టీస్ కు విరామం

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రీ-ఎంట్రీ ఎప్పుడాఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. గత ఏడుమాసాలుగా అంతర్జాతీయ క్రికెట్ కు తనకుతానుగా దూరమై కుటుంబవ్యవహారాలకు మాత్రమే పరిమితమైన ధోనీ…ఐపీఎల్ 13వ సీజన్ ద్వారా రీ-ఎంట్రీకి సిద్ధమయ్యాడు.

ఐపీఎల్ లో తన హోంగ్రౌండ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా…మార్చి 3 నుంచి సురేష్ రైనా, అంబటి రాయుడు లాంటి ఆటగాళ్లతో కలసి ప్రాక్టీసు ప్రారంభించాడు.

గత రెండువారాలుగా నెట్ ప్రాక్టీసులో చురుకుగా పాల్గొంటూ వచ్చిన ధోనీ…కరోనా వైరస్ హెచ్చరికలతో చెన్నై నుంచి స్వస్థలం రాంచీకి తిరిగి వెళ్లాడు. ఐపీఎల్ 13వ సీజన్ పోటీలను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించడంతో..చెన్నై ఫ్రాంచైజీ సైతం ప్రాక్టీసు శిబిరాన్ని మూసివేసినట్లు ప్రకటించింది.

గత ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో ఆఖరు సారిగా పాల్గొన్న ధోనీ ఆ తర్వాత నుంచి..క్రికెట్ నుంచి సెమీరిటైర్మెంట్ తీసుకొన్నాడు.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే 2020 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొని రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాడు. మరోవైపు ఎంపిక సంఘం మాత్రం…ధోనీ గత రికార్డులు, విజయాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని…రీఎంట్రీతో తిరిగి ఫీల్డ్ లో సత్తాచాటుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.

భారత క్రికెట్లో ధోనీ రీ-ఎంట్రీ సీరియల్ ఇప్పుడు నరాలు తెగే ఉత్కంఠను కలిగించే థ్రిల్లర్ సీరియల్ లా సాగుతోంది.

First Published:  15 March 2020 8:08 AM GMT
Next Story