కరోనా ఎఫెక్ట్: మాజీ సీఎం కొడుకు పెళ్లి రద్దు?
కరోనా వైరస్ భారత్ కు వచ్చేసింది. కర్ణాటకలో తొలి కరోనా మృతి సంభవించింది. ఢిల్లీలో రెండో మరణం నమోదైంది. 97మందికి పైగా దేశంలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు. అన్నింటికి సెలవులు ఇచ్చేశారు. కరోనా కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ ఎఫెక్ట్ తాజాగా మాజీ సీఎం కుమారుడి వివాహానికి కూడా తాకింది. జేడీయూ అధినేత దేవే గౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి రద్దు చేయాలని దాదాపు […]
కరోనా వైరస్ భారత్ కు వచ్చేసింది. కర్ణాటకలో తొలి కరోనా మృతి సంభవించింది. ఢిల్లీలో రెండో మరణం నమోదైంది. 97మందికి పైగా దేశంలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు. అన్నింటికి సెలవులు ఇచ్చేశారు.
కరోనా కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ ఎఫెక్ట్ తాజాగా మాజీ సీఎం కుమారుడి వివాహానికి కూడా తాకింది. జేడీయూ అధినేత దేవే గౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి రద్దు చేయాలని దాదాపు నిర్ణయించారట.. పది మంది గుమిగూడే ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా వ్యాపిస్తుందని.. అదే పెళ్లిలాంటి వేడుకల్లో అయితే ఇక వైరస్ వ్యాప్తిని ఆపలేమని… పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో రామనగర జానదలోక వద్ద అంగరంగ వైభవంగా కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న నిఖిల్-రేవతిల వివాహానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కర్ణాటకలో కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వివాహం చేయాలా… వద్దా… అన్న ఆలోచనలో కుమారస్వామి ఉన్నట్టు తెలిసింది.
అయితే ఇంత భారీ ఖర్చు చేసి రద్దు చేయడం కంటే బెంగళూరులో కొద్దిమంది వీఐపీలు, బంధువుల మధ్య వివాహం చేయాలనే ఆలోచనలో మాజీ సీఎం కుమారస్వామి కుటుంబం ఉన్నట్టు తెలిసింది. ఏది ఏమైనా ఏకంగా కరోనా ఎఫెక్ట్ తో మాజీ సీఎం కుమారుడి పెళ్లి డైలమాలో పడడం చర్చనీయాంశమైంది.