కరోనాపై ట్రంప్ సంచలన నిర్ణయం... హెల్త్ ఎమర్జెన్సీ
కరోనా కల్లోలానికి అమెరికా సైతం బెంబేలెత్తిపోతోంది. ఇన్నాళ్లు… చైనాలో పుట్టిన ఈ వైరస్ తమను ఏం చేస్తుందని నింపాదిగా ఉన్న అమెరికాలో నిన్న ఒక్కరోజే 7మంది చనిపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 2009 స్వైన్ ఫ్లూ తర్వాత దేశంలో మరోసారి నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. అమెరికాలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. తాజాగా ఏడుగురు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య అమెరికాలో ఏకంగా 48మందికి […]
కరోనా కల్లోలానికి అమెరికా సైతం బెంబేలెత్తిపోతోంది. ఇన్నాళ్లు… చైనాలో పుట్టిన ఈ వైరస్ తమను ఏం చేస్తుందని నింపాదిగా ఉన్న అమెరికాలో నిన్న ఒక్కరోజే 7మంది చనిపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 2009 స్వైన్ ఫ్లూ తర్వాత దేశంలో మరోసారి నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది.
అమెరికాలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. తాజాగా ఏడుగురు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య అమెరికాలో ఏకంగా 48మందికి చేరుకుంది. హాలీవుడ్ స్టార్లకు సైతం కరోనా సోకడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఆరోగ్యశాఖకు అన్ని అధికారాలు ఇచ్చేశారు.
హెల్త్ ఎమర్జెన్సీలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ 50 బిలియన్ డాలర్లను కేటాయించారు. రాష్ట్రాలు ఎక్కువ నిధులు ఖర్చు చేసేందుకు అనుమతిచ్చారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించారు.
ఇక అమెరికాలో 30 బెడ్లను మించి కరోనా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. 90 గంటల డిశ్చార్జి పరిమితిని ఎత్తివేశారు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా 2,270కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ట్రంప్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వైట్ హౌస్ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలిచ్చారు.