Telugu Global
NEWS

భారత క్రీడారంగంలో కరోనా ఎమర్జెన్సీ

ఐపీఎల్ వాయిదా, సఫారీలతో వన్డే సిరీస్ రద్దు భారత క్రీడాసంఘాలు, క్రికెట్ నియంత్రణమండలి…తమకు ఆటల కంటే భద్రతే ముఖ్యమని ప్రకటించాయి. కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి ముందు జాగ్రత్త చర్యగా..కరోనా ఎమర్జెన్సీని ప్రకటించాయి. మార్చి 29 నుంచి ముంబై వేదికగా ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో జరగాల్సిన కీలక సమావేశానికి ముందే […]

భారత క్రీడారంగంలో కరోనా ఎమర్జెన్సీ
X
  • ఐపీఎల్ వాయిదా, సఫారీలతో వన్డే సిరీస్ రద్దు

భారత క్రీడాసంఘాలు, క్రికెట్ నియంత్రణమండలి…తమకు ఆటల కంటే భద్రతే ముఖ్యమని ప్రకటించాయి. కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి ముందు జాగ్రత్త చర్యగా..కరోనా ఎమర్జెన్సీని ప్రకటించాయి.

మార్చి 29 నుంచి ముంబై వేదికగా ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో జరగాల్సిన కీలక సమావేశానికి ముందే ఈ నిర్ణయం ప్రకటించారు.

ఏప్రిల్ 15 వరకూ విదేశీయులకు వీసాలు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించడంతో..అప్పటి వరకూ ఐపీఎల్ ను వాయిదా వేయనున్నట్లు తెలిపారు.

క్రికెటర్లను, అభిమానులను కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నామని, తమకు క్రికెట్ కంటే ప్రాణాలే ముఖ్యమని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా లక్షా 30వేల మందికి వైరస్ సోకడం, 5వేల మందికి పైగా మరణించడంతో వివిధ దేశాలు… విమాన ప్రయాణాలను రద్దు చేయడం, వీసాలపై నిషేధం విధించడం వంటి చర్యలు చేపట్టాయి.

భారత ప్రభుత్వం సైతం విదేశీయులకు ఏప్రిల్ 15 వరకూ వీసాలు జారీ చేయరాదని నిర్ణయించింది. దీనికితోడు ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఫ్రాంచైజీలు సైతం ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించడానికి అశక్తత ప్రకటించడంతో…పోటీలను వాయిదా వేయక తప్పలేదని బీసీసీఐ వివరణ ఇచ్చింది.

ఆఖరి రెండువన్డేలు రద్దు…

అంతేకాదు…సౌతాఫ్రికాతో తీన్మార్ వన్డే సిరీస్ లో బాగంగా మార్చి 15న లక్నో, మార్చి 18న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన ఆఖరి రెండువన్డేలూ రద్దు చేసినట్లు కూడా బీసీసీఐ ప్రకటించింది.

గేట్లు మూసి ఇరానీట్రోఫీ మ్యాచ్..

రంజీ విజేత సౌరాష్ట్ర్ర- రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య రాజ్ కోట వేదికగా మార్చి 18 నుంచి ఐదురోజులపాటు జరగాల్సిన ఇరానీ ట్రోఫీ మ్యాచ్ ను..అభిమానులకు ప్రవేశం లేకుండా గేట్లు మూసి నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఇరానీ ట్రోఫీ మ్యాచ్ కు మీడియా ప్రతినిధులు, రెండుజట్ల సభ్యులతో పాటు..మ్యాచ్ నిర్వాహకులు, టీవీ బ్రాడ్ కాస్టర్ సిబ్బందిని మాత్రమే అనుమతించనున్నారు.

First Published:  14 March 2020 9:33 AM IST
Next Story