Telugu Global
NEWS

ఆల్-ఇంగ్లండ్ లో ముగిసిన భారత పోటీ

క్వార్టర్స్ లోనే పీవీ సింధు అవుట్ ప్రపంచ ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్లో భారత క్రీడాకారుల పోటీ ముగిసింది. భారత చివరిఆశ పీవీ సింధు సైతం క్వార్టర్స్ లోనే ఇంటిదారి పట్టింది. సెమీఫైనల్లో చోటు కోసం బర్మింగ్ హామ్ ఎరీనా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ప్రపంచ చాంపియన్ సింధును మాజీ చాంపియన్, జపాన్ ప్లేయర్ నజోమీ ఒకుహర మూడుగేమ్ ల సమరంలో అధిగమించింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోటీ తొలిగేమ్ ను […]

ఆల్-ఇంగ్లండ్ లో ముగిసిన భారత పోటీ
X
  • క్వార్టర్స్ లోనే పీవీ సింధు అవుట్

ప్రపంచ ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్లో భారత క్రీడాకారుల పోటీ ముగిసింది. భారత చివరిఆశ పీవీ సింధు సైతం క్వార్టర్స్ లోనే ఇంటిదారి పట్టింది.

సెమీఫైనల్లో చోటు కోసం బర్మింగ్ హామ్ ఎరీనా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ప్రపంచ చాంపియన్ సింధును మాజీ చాంపియన్, జపాన్ ప్లేయర్ నజోమీ ఒకుహర మూడుగేమ్ ల సమరంలో అధిగమించింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోటీ తొలిగేమ్ ను 21-11తో అలవోకగా గెలుచుకొన్న సింధు…ఆ తర్వాతి రెండుగేమ్ ల్లోనూ దీటైన ఆటతీరు ప్రదర్శించలేకపోయింది.

ఒకుహరా 21-15, 21-13తో ఆఖరి రెండుగేమ్ లు నెగ్గి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది. తీవ్రంగా ఆలసిపోయిన సింధు ఆఖరిగేమ్ లో ఒకుహరా ముందు నిలువలేకపోయింది.

మరో క్వార్టర్ ఫైనల్లో ఇంటానెన్ రచనోక్ పై 15-21, 21-17, 21-15తో నెగ్గిన ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ చెన్ యూఫేతో .. ఫైనల్లో చోటు కోసం ఒకుహరా అమీతుమీ తేల్చుకోనుంది.

పురుషుల క్వార్టర్ ఫైనల్స్ లో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ ను మలేసియా ఆటగాడు లీ జియా జీ ఓడించగా…షీ యూ క్వీ పై మాజీ చాంపియన్ విక్టర్ యాక్సెల్ సన్ నెగ్గి సెమీస్ కు చేరుకోగలిగారు.

First Published:  14 March 2020 2:00 AM IST
Next Story