Telugu Global
NEWS

నెల్లూరును తాకిన కరోనా... రాష్ట్రంలో మొదటి కేసు నమోదు

కరోనా మహమ్మారి.. ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. ఇన్నాళ్లూ అనుమానితులే కనబడగా.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వచ్చింది. ప్రభుత్వం కూడా.. ప్రజలను ఈ దిశగా అప్రమత్తం చేస్తూ వచ్చింది. ఇంతలోనే.. కరోనా లక్షణాలు ఓ వ్యక్తికి ధృవీకరిస్తూ.. పుణె వైరాలజీ ప్రయోగశాల.. నివేదిక పంపింది. ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ విద్యార్థి.. దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా… అతని నమూనాలు పరీక్షలకు పంపారు. ఆ వ్యక్తికి కరోనా నిర్థరణ అయిన నేపథ్యంలో.. రాష్ట్ర […]

నెల్లూరును తాకిన కరోనా... రాష్ట్రంలో మొదటి కేసు నమోదు
X

కరోనా మహమ్మారి.. ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. ఇన్నాళ్లూ అనుమానితులే కనబడగా.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వచ్చింది. ప్రభుత్వం కూడా.. ప్రజలను ఈ దిశగా అప్రమత్తం చేస్తూ వచ్చింది. ఇంతలోనే.. కరోనా లక్షణాలు ఓ వ్యక్తికి ధృవీకరిస్తూ.. పుణె వైరాలజీ ప్రయోగశాల.. నివేదిక పంపింది. ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ విద్యార్థి.. దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా… అతని నమూనాలు పరీక్షలకు పంపారు.

ఆ వ్యక్తికి కరోనా నిర్థరణ అయిన నేపథ్యంలో.. రాష్ట్ర పరిధిలో ఇదే తొట్ట తొలి కేసుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇటలీ నుంచి ముందుగా దిల్లీ విమానాశ్రయానికి వచ్చి.. అక్కడి నుంచి చెన్నై వచ్చి.. నేరుగా కారులో ఇంటికి చేరుకున్నట్టుగా ఆ విద్యార్థి కదలికలను అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులతో పాటు కారు డ్రైవరుతో సన్నిహితంగా మెలిగినట్టుగా గుర్తించి.. మొత్తం ఐదుగురికి కూడా పరీక్షలు చేశారు.

ప్రస్తుతానికి ఆ ఐదుగురిలో కరోనా ప్రభావం లేదని గుర్తించారు. అయినా.. ముందు జాగ్రత్తగా 14 రోజల పాటు వైద్యుల పరిశీలనలో పెట్టారు. అలాగే.. జర్మనీ నుంచి విజయవాడ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా అనుమానంతో చికిత్స అందిస్తున్నారు. అతని నమూనాలను పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నారు. విశాఖ, అనంతపురం, కర్నూలులోనూ అనుమానిత కేసులు నమోదవగా.. అధికారులు పరీక్షలు చేయిస్తున్నారు.

వీటి ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం.. హుటాహుటిన అధికారులను మరింత అప్రమత్తం చేసింది. శ్రీశైలం దర్శన లైన్లో ఉన్న భక్తుల చేతులను అధికారులు శుభ్రం చేయించి దర్శనానికి పంపించారు. విదేశీ భక్తులు కొన్నాళ్లు శ్రీశైలం రావొద్దని కోరారు. తిరుపతిలోనూ రక్షణ చర్యలు ముమ్మరం చేశారు. నెల్లూరులో సినిమా థియేటర్లు మూసి వేశారు.

మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి.. ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. 0866 2410978 నంబరుతో ప్రత్యేక కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు.

First Published:  13 March 2020 2:38 AM IST
Next Story