Telugu Global
NEWS

కేసీఆర్... మళ్లీ తన మార్క్ చాటారు

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరోసారి తన మార్క్ చాటారు. రాజ్యసభ స్థానాలకు సీట్ల ఎంపికలో.. సంచలనం సృష్టించే స్థాయిలో కాకున్నా.. తన శైలికి భిన్నంగానే అభ్యర్థులను ఎంపిక చేశారు. పార్టీ తరఫున రెండు స్థానాలకు అభ్యర్థులు ఎన్నికయ్యే అవకాశం ఉండగా.. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం.. సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావుకు రెండోసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్. కేకేకు సీటు ఖాయమన్న వార్త కొన్నిరోజులుగా వినిపిస్తూనే ఉంది. మిగతా రెండో […]

కేసీఆర్... మళ్లీ తన మార్క్ చాటారు
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరోసారి తన మార్క్ చాటారు. రాజ్యసభ స్థానాలకు సీట్ల ఎంపికలో.. సంచలనం సృష్టించే స్థాయిలో కాకున్నా.. తన శైలికి భిన్నంగానే అభ్యర్థులను ఎంపిక చేశారు.

పార్టీ తరఫున రెండు స్థానాలకు అభ్యర్థులు ఎన్నికయ్యే అవకాశం ఉండగా.. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం.. సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావుకు రెండోసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్.

కేకేకు సీటు ఖాయమన్న వార్త కొన్నిరోజులుగా వినిపిస్తూనే ఉంది. మిగతా రెండో సీటు విషయంలోనే అందరిలో అయోమయం నెలకొంది. పార్టీలో చాలా మంది సీనియర్లు అవకాశం కోసం ప్రయత్నించారు. వారిలో.. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి ఒకరు. తనకు సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పోటీకి అవకాశం రాకపోవడంపై ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యసభ సభ్యత్వంపై గంపెడాశలతో ఇన్నాళ్లు ప్రయత్నాలు చేశారు.

కానీ.. ఆయనకు సొంత జిల్లాకు చెందిన నేతలే అడ్డుతగిలారన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు.. నిజామాబాద్ నుంచి ఎంపీగా ఓడిన కవిత. ఆమెకు ఈ సారి బెర్త్ ఖాయమన్న అంచనాలు అనూహ్యంగా వినిపించాయి. కేసీఆర్ కు ఢిల్లీ స్థాయిలో మంచి నేత లేకుండా పోయారని.. గతంలో వినోద్ కుమార్ స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే నాయకులు ఇప్పుడు లేరని.. కవితను రాజ్యసభకు పంపి.. ఆ లోటు తీర్చుకుంటారని అంతా అనుకున్నారు.

పొంగులేటికి, కవితకు అవకాశం ఇవ్వని కేసీఆర్.. మిగతా సీనియర్లు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, నాయిని నర్సింహారెడ్డిలాంటి ఉద్ధండులకూ రాజ్యసభ సీటు ఇవ్వలేదు. చివరికి.. తాను గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. ఉత్తర తెలంగాణకు చెందిన సురేష్ రెడ్డికి.. రెండో సీటు ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన మాటకు తోడు.. సొంత జిల్లా నేతలు పట్టుబట్టి మరీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేయించారు.

ఇలా.. రెండో సీటు విషయంలో మరోసారి తన మార్క్ చాటుకున్న కేసీఆర్.. సీట్ల కేటాయింపును పూర్తి చేశారు.

First Published:  13 March 2020 2:58 AM IST
Next Story