Telugu Global
National

కరోనా ఉచ్చులో.... దక్షిణాది రాష్ట్రాలు

కరోనా వైరస్ (కొవిడ్ 19) ఉచ్చులో దక్షిణాది రాష్ట్రాలు చిక్కుతున్నాయా? తొలి కేసు.. తొలి మరణం దక్షిణాదిలోనే వెలుగు చూడడం.. తీవ్రతకు సంకేతమా? ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ఫలితాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదా? తాజా పరిణామాలు చూస్తుంటే.. ఈ ప్రశ్నలకు మెజారిటీ ప్రజలు అవుననే సమాధానం ఇస్తున్నారు. చైనా నుంచి కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. అది మన దేశాన్ని తాకేందుకు చాలా రోజులే తీసుకుంది. అంతా బానే ఉంది అని ప్రజలు […]

కరోనా ఉచ్చులో.... దక్షిణాది రాష్ట్రాలు
X

కరోనా వైరస్ (కొవిడ్ 19) ఉచ్చులో దక్షిణాది రాష్ట్రాలు చిక్కుతున్నాయా? తొలి కేసు.. తొలి మరణం దక్షిణాదిలోనే వెలుగు చూడడం.. తీవ్రతకు సంకేతమా? ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ఫలితాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదా? తాజా పరిణామాలు చూస్తుంటే.. ఈ ప్రశ్నలకు మెజారిటీ ప్రజలు అవుననే సమాధానం ఇస్తున్నారు.

చైనా నుంచి కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. అది మన దేశాన్ని తాకేందుకు చాలా రోజులే తీసుకుంది. అంతా బానే ఉంది అని ప్రజలు భావిస్తున్నా.. లోలోపల ఎక్కడో ఓ ఆందోళన. మన పొరుగు దేశం. ఎక్కడి నుంచైనా ఎలా అయినా ఆ వైరస్ మన దేశాన్ని తాకవచ్చన్న టెన్షన్. చివరకి ఆ ఆందోళన… ఆ టెన్షన్ నిజమయ్యాయి.

కేరళను తాకిన కరోనా.. మెల్లగా వివిధ రూపాల్లో ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. వేర్వేరు దేశాల నుంచి మన దేశానికి వచ్చి.. ఆయా రాష్ట్రాలకు వెళ్లిన వారి కారణంగా.. ముఖ్యంగా అమెరికా, సౌదీ, ఇటలీ నుంచి వచ్చినవారి కారణంగా కరోనా మన దగ్గర మెల్లగా పాకడం మొదలైంది. కేరళ.. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రాష్ట్రాల్లో ప్రవేశించిన ఈ వైరస్.. కర్ణాటకలో ఏకంగా ఓ మనిషిని బలి తీసుకుంది.

ఈ వివరాలన్నీ చూస్తే.. దక్షిణ భారత రాష్ట్రాల్లోని కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలను కరోనా కాస్త ఎక్కువగానే భయపెడుతోందని చెప్పవచ్చు. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగానే కనిపిస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్ని కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినా.. ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోకుంటే.. ఆ చర్యలు నిష్ఫలం కాక తప్పదు.

First Published:  12 March 2020 9:47 PM GMT
Next Story