కరోనా చంపేసింది... భారతీయుడి ప్రాణం తీసింది
కరోనా వైరస్ కారణంగా.. మన దేశంలో తొలి మరణం సంభవించింది. ఇన్నాళ్లూ అనుమానిత కేసులు.. వారికి నిపుణులైన వైద్యుల సమక్షంలో పర్యవేక్షణ మాత్రమే మనం చూసినా.. కర్ణాటకలోని కలబురిగికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల క్రితమే అతను చనిపోయినా.. పరీక్షలు చేసి కరోనానే కారణమని నిర్థరించుకున్న తర్వాత.. ఈ విషయాన్ని వెల్లడించింది. కర్ణాటక అధికారులు తెలిపిన ప్రకారం.. దుబాయ్ నుంచి ఫిబ్రవరిలో ఆ వృద్ధుడు […]
కరోనా వైరస్ కారణంగా.. మన దేశంలో తొలి మరణం సంభవించింది. ఇన్నాళ్లూ అనుమానిత కేసులు.. వారికి నిపుణులైన వైద్యుల సమక్షంలో పర్యవేక్షణ మాత్రమే మనం చూసినా.. కర్ణాటకలోని కలబురిగికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల క్రితమే అతను చనిపోయినా.. పరీక్షలు చేసి కరోనానే కారణమని నిర్థరించుకున్న తర్వాత.. ఈ విషయాన్ని వెల్లడించింది.
కర్ణాటక అధికారులు తెలిపిన ప్రకారం.. దుబాయ్ నుంచి ఫిబ్రవరిలో ఆ వృద్ధుడు దేశానికి వచ్చాడు. అప్పటి నుంచే దగ్గు, జ్వరంతో బాధపడ్డాడు. హైదరాబాద్ లోనూ చికిత్స తీసుకున్నాడు. తర్వాత కలబురిగి వెళ్లగా.. అక్కడే చనిపోయాడు. అతను ఎవరెవరితో ఉన్నారు.. ఎవరెవరిని కలిశారు.. అన్న వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వారిని గుర్తించి పరీక్షలు చేయించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.
ప్రస్తుతానికి 74 కేసులు నమోదు కాగా.. అందులో తొలి మరణం ఇతనిదే అయ్యింది. వృద్ధుడు కావడం.. అనారోగ్యం తీవ్రంగా ఉండడం.. అందునా కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ సోకడమే ఇంతటి పరిస్థితికి దారి తీసిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వార్త.. ఇతర రాష్ట్రాలనూ ఆందోళనలో ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో సినిమా థియేటర్లు మూతపడేలా.. స్కూళ్లకు సెలవులు ప్రకటించేలా చేసింది.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. జన సమ్మర్థ ప్రాంతాల్లోకి వెళ్లాల్సి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి.