పవన్ సినిమాల్లో... జనసేన నాదెండ్ల చేతిలో... ఫ్యాన్స్ అయోమయంలో!
పవర్ స్టార్…. అలియాస్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్…. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాక జనసేనను పూర్తిగా పట్టించుకోవడం మానేసినట్టున్నారు. ఇంత విషయానికే అంత గొంతేసుకుని వీరావేశం ప్రదర్శించే పవన్.. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుతున్న వేళ…. పూర్తిగా సినిమాలకే పరిమితం కావడాన్ని… జన సైనికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా…. కీలక నిర్ణయాలన్నీ నాదెండ్ల మనోహర్ తీసుకుంటుండడం… కొందరిలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. పార్టీని పూర్తిగా నాదెండ్ల చేతుల్లో పెట్టేసి.. తను పూర్తి […]
పవర్ స్టార్…. అలియాస్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్…. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాక జనసేనను పూర్తిగా పట్టించుకోవడం మానేసినట్టున్నారు. ఇంత విషయానికే అంత గొంతేసుకుని వీరావేశం ప్రదర్శించే పవన్.. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుతున్న వేళ…. పూర్తిగా సినిమాలకే పరిమితం కావడాన్ని… జన సైనికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా…. కీలక నిర్ణయాలన్నీ నాదెండ్ల మనోహర్ తీసుకుంటుండడం… కొందరిలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.
పార్టీని పూర్తిగా నాదెండ్ల చేతుల్లో పెట్టేసి.. తను పూర్తి స్థాయి సినిమా నటుడిగా మళ్లీ మారిపోతారా? లేదంటే వార్తలు వినిపిస్తున్నట్టుగా ఐదారు వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాక మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ తరఫున ప్రచారం ఏమైనా చేస్తారా? అది కూడా జనసేనలో స్టార్ పొలిటీషియన్ నాదెండ్ల మనోహర్ కే అప్పగిస్తారా? అభ్యర్థుల ఎంపికలో పవన్ ప్రమేయం ఉంటుందా? బీజేపీ సూచించిన వారికే అవకాశాలు దక్కుతాయా? అసలు.. వైసీపీ నేతలు దూకుడుమీదున్న వేళ.. జనసేన తరఫున పవన్ ఏమైనా తన గొంతు వినిపిస్తాడా? లేదంటే సినిమా షూటింగులతో ఇలాగే మాట మాట్లాడకుండా కాలం వెళ్లదీస్తాడా?….
ఇలా అభిమానులు.. అనుచరులు.. జన సైనికులు మాత్రమే కాదు… జనసేన ఇటీవల వేస్తున్న అడుగులు చూసి సామాన్యులు మాట్లాడుకుంటున్న విషయాలివి.
కాస్త జాగ్రత్తగా ఆలోచించి చూస్తే.. ఈ ప్రశ్నల్లోనూ అర్థముంది. కీలక సమయంలో రాజకీయాల్లో అజ్ఞాతవాసిగా మారిన పవన్.. తననే నమ్ముకున్న కేడర్ ను మాత్రం అయోమయంలో పడేశాడన్న విమర్శనైతే ఎదుర్కొంటున్నారు. త్వరగా.. జనసేన వ్యవహారాల్లో యాక్టివ్ కావాలని అంతా కోరుకుంటున్నా.. ఆయన మాత్రం తనకే సాధ్యమైన మౌనాన్ని కొనసాగిస్తున్నారు.
ఇదే మంచి అవకాశంగా.. నాదెండ్ల మరింత యాక్టివ్ అవుతున్నారు. ఈ పరిణామం ఎక్కడి వరకూ వెళ్తుందన్నదే.. జనసేన వర్గాలను ఆలోచనలో పడేస్తోంది.