నత్వానీకి రాజ్యసభ... జగన్ కండీషన్స్ పెట్టారా?
ఇన్నాళ్లూ ఆయన పారిశ్రామికవేత్తగా మాత్రమే ప్రపంచానికి తెలిసి ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియన్. అది కూడా.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన రాజకీయ నాయకుడు. ఇప్పటివరకూ ముఖేష్ అంబానీ సిఫారసుతో స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చిన పరిమల్ నత్వానీ.. ఇకపై రాజ్యసభలో వైసీపీ సభ్యులతో కలిసి కూర్చోవాలి. రాష్ట్ర సమస్యలపై మాట్లాడాలి. చెప్పిన మాటకు కట్టుబడి రాష్ట్రానికి నిధులు సాధించాలి. అవును.. ఇదంతా నిజమే. ఎందుకో తెలుసుకోవాలంటే.. పూర్తి కథనం […]
ఇన్నాళ్లూ ఆయన పారిశ్రామికవేత్తగా మాత్రమే ప్రపంచానికి తెలిసి ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియన్. అది కూడా.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన రాజకీయ నాయకుడు. ఇప్పటివరకూ ముఖేష్ అంబానీ సిఫారసుతో స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చిన పరిమల్ నత్వానీ.. ఇకపై రాజ్యసభలో వైసీపీ సభ్యులతో కలిసి కూర్చోవాలి. రాష్ట్ర సమస్యలపై మాట్లాడాలి. చెప్పిన మాటకు కట్టుబడి రాష్ట్రానికి నిధులు సాధించాలి. అవును.. ఇదంతా నిజమే. ఎందుకో తెలుసుకోవాలంటే.. పూర్తి కథనం చదవండి.
ముఖేష్ అంబానీ అంతటి వ్యక్తే వచ్చి.. జగన్ చేతులు పట్టుకున్నాడు. మీకు బలం చాలా ఉంది కదా.. మావాడికి ఓ సీటు ఇవ్వండని రిక్వెస్ట్ చేశాడు. ముఖేష్ అంబానీ మాటను కాదు అని చెప్పకుండానే.. కొన్ని షరతులను జగన్ విధించారట. అందులో మొదటిది.. పార్టీ కండువా వేసుకోవడం, సభ్యత్వం తీసుకోవడం. రెండోది.. పార్టీ తరఫున సభకు హాజరవడం. మూడోది.. ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు సాధించడం. ఇవన్నీ చేస్తానంటే తనకు సీటు కేటాయించేందుకు సమస్య లేదని జగన్.. అంబానీకే తెగేసి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ఫలితంగానే.. పరిమల్ నత్వానీ వైసీపీ సభ్యత్వం తీసుకుని.. జగన్ తో పార్టీ కండువా వేయించుకుని మరీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారట. ఫలితంగా.. పార్టీ బలం పార్లమెంటులో మరింత పెరుగుతుంది. కీలక బిల్లుల సమయంలో విప్ కు అనుగుణంగా వ్యవహరించాల్సి వస్తుంది. జాతీయ స్థాయిలో వైసీపీ గొంతు వినిపించాల్సి ఉంటుంది.
వీటన్నిటికీ అంగీకరించాకే.. జగన్.. నత్వానీకి చాన్స్ ఇచ్చారన్న చర్చ.. జోరుగా ఏపీ పొలిటికల్ చౌరస్తాలో వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు పక్కనబెడితే.. జగన్ మాత్రం అంత సులువుగా అవకాశం ఇచ్చే వ్యక్తి అయితే కాదు.
అందుకే.. నత్వానీకి ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క. వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఆయన పనితీరు ఎలా ఉండబోతోందన్నది.. అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. విజయసాయి లాంటి పర్ఫెక్ట్ పొలిటికల్ ప్లానర్ తో ఆయన ప్రయాణం ఎలా కొనసాగుతుందన్నది చూడాలి.