వైసీపీలోకి కరణం బలరాం.... ప్రకాశంలో టీడీపీ ఖాళీకి స్కెచ్
తెలుగుదేశంపార్టీకి మరో షాక్ తగిలింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసిపిలో చేరేందుకు సిద్దమవడంతో టిడిపి నేతలు షాక్‌కు గురయ్యారు. ఈ నేపధ్యంలో కరణం బలరాంతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించేందుకు ప్రయత్నించి విఫలమైనట్టు సమాచారం. కరణం బలరాంతో పాటు శిద్ధారాఘవరావు, బాపట్ల మాజీ ఎంపీ మాల్యాద్రి కూడా పార్టీ మారుతారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. చీరాల నియోజవర్గానికే చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల […]

తెలుగుదేశంపార్టీకి మరో షాక్ తగిలింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసిపిలో చేరేందుకు సిద్దమవడంతో టిడిపి నేతలు షాక్‌కు గురయ్యారు.
ఈ నేపధ్యంలో కరణం బలరాంతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించేందుకు ప్రయత్నించి విఫలమైనట్టు సమాచారం. కరణం బలరాంతో పాటు శిద్ధారాఘవరావు, బాపట్ల మాజీ ఎంపీ మాల్యాద్రి కూడా పార్టీ మారుతారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.
చీరాల నియోజవర్గానికే చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇటీవలే వైసీపీలో చేరారు.అక్కడినుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైసీపీలో చేరనుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా కరణం బలరాం వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది.
అయితే గతంలో ఆయన టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో చీరాలలో కరణం బలరాంకు ఎన్నికల్లో చేదోడువాదోడుగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇటీవల వైసీపీలో చేరడం వెనుక కూడా బలరాం ప్రోత్సాహం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
2014లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్ననాటినుంచి కరణం బలరాం టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి కరణం కుటుంబానికి సీటు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చీరాల నుంచి టీడీపీ బరిలోకి దించింది. అది కూడా కరణంపై అభిమానంతో కాకుండా అవసరం కోసం కరణంను చంద్రబాబు వాడుకున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అప్పటినుంచే చంద్రబాబుపై గుర్రుగా ఉన్న కరణం చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత…పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కరణం బలరాంకు అద్దంకి, చీరాల నియోజకవర్గాలతో పాటు ఒంగోలు, ప్రకాశంజిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారు. కరణం బలరాంతో పాటు వైసీపీలో చేరేందుకు ఇప్పటికే పలువురు నేతలు సిద్దమైనట్టు సమాచారం… కొందరు టిడిపి నేతలు కరణం బలరాంకు ఫోన్ చేసి మీతో పాటే మా ప్రయాణం అని చెబుతున్నట్టు తెలిసింది. దీంతో సీఎం వైయస్ జగన్ సమక్షంలో పెద్ద సంఖ్యలో నేతలు, అనుచరులతో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరనున్నారు.