Telugu Global
NEWS

భారత బాక్సర్ల సరికొత్త రికార్డు

తొలిసారిగా ఒలింపిక్స్ కు 9మంది అర్హత టోక్యో ఒలింపిక్స్ కు అర్హతగా జోర్డాన్ రాజధాని అమ్మాన్ వేదికగా ముగిసిన 2020 ఆసియా బాక్సింగ్ అర్హత పోటీలలో భారత బాక్సర్లు కనీసం ఒక్క స్వర్ణం సాధించకపోయినా….రికార్డు స్థాయిలో 9 విభాగాలలో బెర్త్ లు ఖాయం చేసుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలోని మొత్తం 13 విబాగాలలో పోటీకి దిగిన భారత బాక్సర్లు గతంలో ఎన్నడూ లేనంతగా తొమ్మిది విభాగాలలో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం […]

భారత బాక్సర్ల సరికొత్త రికార్డు
X
  • తొలిసారిగా ఒలింపిక్స్ కు 9మంది అర్హత

టోక్యో ఒలింపిక్స్ కు అర్హతగా జోర్డాన్ రాజధాని అమ్మాన్ వేదికగా ముగిసిన 2020 ఆసియా బాక్సింగ్ అర్హత పోటీలలో భారత బాక్సర్లు కనీసం ఒక్క స్వర్ణం సాధించకపోయినా….రికార్డు స్థాయిలో 9 విభాగాలలో బెర్త్ లు ఖాయం చేసుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు.

అంతర్జాతీయ బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలోని మొత్తం 13 విబాగాలలో పోటీకి దిగిన భారత బాక్సర్లు గతంలో ఎన్నడూ లేనంతగా తొమ్మిది విభాగాలలో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం సరికొత్త రికార్డుగా మిగిలిపోతుంది.

మనీష్ కౌషిక్ కు ఆఖరి బెర్త్…

టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ 9వ బెర్త్ ను బారత బాక్సర్ మనీశ్ కౌషిక్ ఖాయం చేసుకొన్నాడు. హోరాహోరీగా సాగిన బాక్సాఫ్ ఫైట్ లో ఆస్ట్ర్రేలియాకు చెందిన కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ హారిసన్ గారిసైడ్ ను 4-1తో మనీష్ చిత్తు చేశాడు.

63 కిలోల విభాగంలో జరిగిన ఈ హోరాహోరీ సమరంలో మనీశ్ పంచ్ లకు హారిసన్ ముక్కుమొకం ఏకమవ్వడమే కాదు… రక్తసిక్తమైపోయింది. మరోవైపు హారిసన్ కొట్టిన దెబ్బలకు మనీశ్ పక్కటెముకలకు సైతం గాయాలయ్యాయి.

స్వర్ణంలేని భారత బాక్సర్లు…

ఒలింపిక్స్ కు తొమ్మిది మంది భారత బాక్సర్లు అర్హత సాధించినా…కనీసం ఒక్కరైనా బంగారు పతకం సాధించలేకపోయారు. పురుషుల 69 కిలోల విభాగంలో వికాస్ కృష్ణన్, మహిళల 60 కిలోల విభాగం పైనల్స్ కు సిమ్రన్ జీత్ కౌర్ చివరకు రజత పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కంటిగాయంతో…వికాస్ కృష్ణన్ టైటిల్ సమరంలో పాల్గొనరాదని నిర్ణయించడంతో…రజతంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది.
మరోవైపు…టైటిల్ పైట్ లో కొరియా బాక్సర్ యోంజీ వోకి …సిమ్రన్ జీత్ కౌర్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

భారత బాక్సింగ్ నవరత్నాలు…

టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత బాక్సర్లలో…మేరీ కోమ్, వికాస్ కృష్ణన్, అమిత్ పంగల్, పూజా రాణీ, లవ్లీనా బోర్గెయిన్, అశీశ్ కుమార్, సతీష్ కుమార్, సిమ్రన్ జీత్ కౌర్, మనీశ్ కౌషిక్ ఉన్నారు.

ఒలింపిక్స్ చరిత్రలోనే ఇంతమంది భారత బాక్సర్లు అర్హత సాధించడంతో భారత బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

First Published:  12 March 2020 1:50 AM IST
Next Story