Telugu Global
NEWS

ఆల్-ఇంగ్లండ్ ఓపెన్లో సింధు బోణీ

తొలిరౌండ్లోనే కిడాంబీ శ్రీకాంత్ ఓటమి బర్మింగ్ హామ్ వేదికగా ప్రారంభమైన 110వ ఆల్- ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీప్రారంభరౌండ్లలో భారత క్రీడాకారులకు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు తొలిరౌండ్ విజయంతో ప్రీ-క్వార్ట్రర్ పైనల్స్ చేరితే…పురుషుల సింగిల్స్ లో కిడాంబీ శ్రీకాంత్ కు చుక్కెదురయ్యింది. గత ఏడాదిగా వరుస పరాజయాలతో కంగుతిన్న సింధు…తన తొలిరౌండ్ మ్యాచ్ లో అమెరికాకు చెందిన చైనా సంతతి ప్లేయర్ బీవెన్ జాంగ్ ను 21-14, 21-17తో ఓడించింది. పురుషుల సింగిల్స్ […]

ఆల్-ఇంగ్లండ్ ఓపెన్లో సింధు బోణీ
X
  • తొలిరౌండ్లోనే కిడాంబీ శ్రీకాంత్ ఓటమి

బర్మింగ్ హామ్ వేదికగా ప్రారంభమైన 110వ ఆల్- ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీప్రారంభరౌండ్లలో భారత క్రీడాకారులకు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి.

భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు తొలిరౌండ్ విజయంతో ప్రీ-క్వార్ట్రర్ పైనల్స్ చేరితే…పురుషుల సింగిల్స్ లో కిడాంబీ శ్రీకాంత్ కు చుక్కెదురయ్యింది.

గత ఏడాదిగా వరుస పరాజయాలతో కంగుతిన్న సింధు…తన తొలిరౌండ్ మ్యాచ్ లో అమెరికాకు చెందిన చైనా సంతతి ప్లేయర్ బీవెన్ జాంగ్ ను 21-14, 21-17తో ఓడించింది.

పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో చైనా సూపర్ స్టార్ చెన్ లాంగ్ 21-15, 21-16తో కిడాంబీ శ్రీకాంత్ ను అధిగమించడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ అవకాశాలను మరింత క్లిష్టంగా మార్చాడు.

త్వరలో జరిగే టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనాలంటే ప్రపంచ మొదటి 16 ర్యాంకుల్లో నిలవాల్సి ఉంది. అయితే …కిడాంబీ శ్రీకాంత్ మాత్రం వరుస వైఫల్యాలతో ప్రస్తుతం ప్రపంచ 25వ ర్యాంక్‌ కు పడిపోయాడు. టోక్యో బెర్త్ కావాలంటే ప్రస్తుత 25వ ర్యాంక్ నుంచి 16వ ర్యాంక్ కు చేరని తప్పని పరిస్థితి ఏర్పడింది.

మిక్సిడ్ డబుల్స్ తొలిరౌండ్లోనే భారత జోడీ సిక్కీ రెడ్డి- ప్రణవ్ జెర్రీ చోప్రా నిష్క్రమించక తప్పలేదు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో చోటు కోసం జరిగే పోరులో కొరియా ప్లేయర్ జీ హ్యున్ సుంగ్ తో పీవీ సింధు తలపడాల్సి ఉంది. భారత వెటరన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కు తొలిరౌండ్లోనే యమగుచి గండం పొంచి ఉంది.

First Published:  12 March 2020 2:42 AM IST
Next Story