అదే ప్లాన్..అదే స్కెచ్.... ప్రతిపక్షానికి ఉక్కపోత
ఎన్నికలు అంటేనే యుద్ధం. అక్కడ గెలవాలంటే ఎత్తులు పైఎత్తులతో ముందుకెళ్ళాలి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ ఇదే చేశారు. పక్కా వ్యూహాంతో ముందుకు వెళ్లారు. అధికార పార్టీని గురిచూసి దెబ్బకొట్టారు. 23 నెంబర్ దగ్గర సెట్ చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా అదే వ్యూహాంతో జగన్ ముందుకు వెళుతున్నారు. టీడీపీకి ఉక్కపోత లెవల్ పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలోకి ఓ ప్లాన్ ప్రకారం వలసలు కొనసాగాయి. మొదట్లో నెలకో నేత […]
ఎన్నికలు అంటేనే యుద్ధం. అక్కడ గెలవాలంటే ఎత్తులు పైఎత్తులతో ముందుకెళ్ళాలి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ ఇదే చేశారు. పక్కా వ్యూహాంతో ముందుకు వెళ్లారు. అధికార పార్టీని గురిచూసి దెబ్బకొట్టారు. 23 నెంబర్ దగ్గర సెట్ చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా అదే వ్యూహాంతో జగన్ ముందుకు వెళుతున్నారు. టీడీపీకి ఉక్కపోత లెవల్ పెంచుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలోకి ఓ ప్లాన్ ప్రకారం వలసలు కొనసాగాయి. మొదట్లో నెలకో నేత పార్టీలో చేరేవారు. ఎన్నికలు దగ్గరపడిన తర్వాత వారానికో నేత వచ్చారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత రోజుకో నేత పార్టీలో చేరే విధంగా ప్రణాళికలు రచించారు. అన్నట్లుగానే హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో కండువాల మార్పిడి నిరంతరం కొనసాగింది. దీంతో అప్పటి అధికార పార్టీకి టెన్షన్ పుట్టుకొచ్చింది. వైసీపీకి జనంలో మైలేజీ తీసుకొచ్చింది.
అప్పటి ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్‌తో మొదలైన వలసలు కంటిన్యూ అయ్యాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున టీడీపీ, కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరారు. సినీనటులు కొందరు జగన్‌ను కలిసి మద్దతు పలికారు. దీంతో అప్పట్లో వైసీపీకి జనంలో క్రేజీ ఏర్పడింది. అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో జనాలు జగన్ వైపు చూశారు.
ఇప్పుడు వైసీపీ అధికార పార్టీ. ఎన్నికల ముందు అదే వలసలను ప్రోత్సహిస్తోంది. ప్రతిపక్ష టీడీపీని డిఫెన్స్‌లోకి నెట్టేస్తోంది. పులివెందుల సతీష్‌రెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, బాలరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటు పలువురు నేతలు ఇప్పుడు క్యూ కట్టారు. ఈ వలసలు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం కన్పిస్తోంది. దీంతో టీడీపీ నుంచి ఎప్పుడు ఏ నేత బయటకు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
మొత్తానికి ఓ వైపు ఎన్నికల తంత్రం… మరోవైపు మైండ్ గేమ్‌తో ప్రతిపక్షాన్ని అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.