Telugu Global
NEWS

క్రికెట్ కు వాసిం జాఫర్ గుడ్ బై

25 సంవత్సరాల క్రికెట్ కెరియర్ కు తెర 1996 నుంచి 2020 వరకూ నిత్యనూతనం రంజీట్రోఫీలో 12వేల పరుగుల వాసిం జాఫర్ 40 రంజీ సెంచరీలు, 10 రంజీట్రోఫీ టైటిల్స్ ముంబై, విదర్భజట్లకు రంజీల్లో ఆడిన జాఫర్ దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో రికార్డుల మొనగాడు, ముంబై కమ్ విదర్భ ఓపెనర్ వాసిం జాఫర్ 42 సంవత్సరాల లేటు వయసులో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో అరడజనుకు పైగా రికార్డులు నెలకొల్పిన వాసిం […]

క్రికెట్ కు వాసిం జాఫర్ గుడ్ బై
X
  • 25 సంవత్సరాల క్రికెట్ కెరియర్ కు తెర
  • 1996 నుంచి 2020 వరకూ నిత్యనూతనం
  • రంజీట్రోఫీలో 12వేల పరుగుల వాసిం జాఫర్
  • 40 రంజీ సెంచరీలు, 10 రంజీట్రోఫీ టైటిల్స్
  • ముంబై, విదర్భజట్లకు రంజీల్లో ఆడిన జాఫర్

దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో రికార్డుల మొనగాడు, ముంబై కమ్ విదర్భ ఓపెనర్ వాసిం జాఫర్ 42 సంవత్సరాల లేటు వయసులో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో అరడజనుకు పైగా రికార్డులు నెలకొల్పిన వాసిం జాఫర్ 25 సంవత్సరాల తన కెరియర్ లో టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు.

1996- 2020

1996-97 క్రికెట్ సీజన్లో ముంబై ఓపెనర్ గా రంజీ క్రికెట్ అరంగేట్రం చేసిన జాఫర్..2020 సీజన్లో విదర్భ టాపార్డర్ ఆటగాడిగా తన చివరి ఇన్నింగ్స్ ఆడాడు.

ముంబై తరపున ఎనిమిదిసార్లు, విదర్భ తరపున రెండుసార్లు రంజీట్రోఫీ సాధించిన జట్లలో సభ్యుడిగా జాఫర్ ఉన్నాడు.
వాసిం జాఫర్ తన రంజీ కెరియర్ లో మొత్తం 156 రంజీమ్యాచ్ లు ఆడి రికార్డు స్థాయిలో 12వేల 38 పరుగులు సాధించాడు. ఇందులో 40 శతకాలు, 89 హాఫ్ సెంచరీలు, 200 క్యాచ్ లు ఉన్నాయి.

రంజీట్రోఫీ చరిత్రలోనే 12వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా కేరళతో జరిగిన మ్యాచ్ లో జాఫర్ ఈ అరుదైన రికార్డు సాధించాడు.

2019-20 క్రికెట్ సీజన్ ను 11వేల 775 పరుగుల స్కోరుతో ప్రారంభించిన జాఫర్…ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లతో 12వేల పరుగుల రికార్డును అందుకోగలిగాడు.

1996-97 టు 2020

1996-97 సీజన్లో ముంబై తరపున రంజీ అరంగేట్రం చేసిన వాసిం జాఫర్ గత 25 సంవత్సరాలుగా తన ప్రస్థానం కొనసాగిస్తూ వస్తున్నాడు. విదర్భజట్టు తరపున తన చివరి రంజీ మ్యాచ్ ఆడిన వాసిం జాఫర్ 150 రంజీ మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా కూడా రికార్డు సాధించాడు.

రంజీట్రోఫీ, ఇరానీ ట్రోఫీల చరిత్రలో అత్యధిక స్కోర్లు సాధించిన మొనగాడిగా నిలిచిన జాఫర్ .. మొత్తం 260 మ్యాచ్ లు ఆడి 19వేల 410 పరుగులు సాధించాడు.

భారత క్రికెటర్ గా…

భారతజట్టులో సభ్యుడిగా 31టెస్టులు, 2 వన్డేలు ఆడిన జాఫర్…తన చిట్టచివరి అంతర్జాతీయ మ్యాచ్ ను 2008లో సౌతాఫ్రికా ప్రత్యర్థిగా ఆడాడు.

భారత క్రికెట్ కు అసమాన సేవలు అందించిన వాసిం జాఫర్ కు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ హ్యాట్సాఫ్ చెప్పాడు. ముంబై, భారతజట్ల తరపున తాము కలసి ఆడామని, ఒత్తిడి అనేది లేకుండా ఆడటంలో వాసిం జాఫర్ కు వేరెవరూ సాటికారని సచిన్ ప్రశంసించాడు.

తన కుమారుల్లో ఎవరో ఒకరు భారతజట్టుకు ఆడాలన్న తన తండ్రి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే అదృష్టం తనకు రావడం పట్ల వాసిం జాఫర్ సంతృప్తి వ్యక్తం చేశాడు.

తన కోసం తన కెరియర్ నే త్యాగం చేసిన భార్యకు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.

First Published:  11 March 2020 6:30 AM IST
Next Story