Telugu Global
NEWS

బాబు తాజా క‌రివేపాకు వ‌ర్ల రామ‌య్య !

అధికారంలో ఉంటే ఒక‌లా… ప్ర‌తిప‌క్షంలో ఉంటే ఒక‌లా… రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వ్య‌వ‌హారం సాగుతుంటుంది. మెజార్టీ ఉన్న‌ప్పుడు త‌న సామాజిక‌వ‌ర్గం, పారిశ్రామిక‌వేత్త‌ల‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతారు. కానీ ఓడిపోతార‌ని తెలిసి….ఎమ్మెల్యేలు సంఖ్య స‌రిపోద‌ని తెలిసి కూడా ఇప్పుడు రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఓడిపోతార‌ని తెలిసి ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ‌ర్ల రామ‌య్య‌ను నిల‌బెడుతున్నారు. ఆయ‌నను రెండేళ్ల కిందట రాజ్య‌స‌భకు పంపుతామ‌ని చివ‌రి వరకూ ఊరించారు. తమకు అనుకూలంగా ఉన్న చాన‌ళ్ల‌లో కూడా వ‌ర్ల‌రామ‌య్య‌కు రాజ్య‌స‌భ టికెట్ […]

బాబు తాజా క‌రివేపాకు వ‌ర్ల రామ‌య్య !
X

అధికారంలో ఉంటే ఒక‌లా… ప్ర‌తిప‌క్షంలో ఉంటే ఒక‌లా… రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వ్య‌వ‌హారం సాగుతుంటుంది.

మెజార్టీ ఉన్న‌ప్పుడు త‌న సామాజిక‌వ‌ర్గం, పారిశ్రామిక‌వేత్త‌ల‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతారు. కానీ ఓడిపోతార‌ని తెలిసి….ఎమ్మెల్యేలు సంఖ్య స‌రిపోద‌ని తెలిసి కూడా ఇప్పుడు రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

ఓడిపోతార‌ని తెలిసి ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ‌ర్ల రామ‌య్య‌ను నిల‌బెడుతున్నారు. ఆయ‌నను రెండేళ్ల కిందట రాజ్య‌స‌భకు పంపుతామ‌ని చివ‌రి వరకూ ఊరించారు. తమకు అనుకూలంగా ఉన్న చాన‌ళ్ల‌లో కూడా వ‌ర్ల‌రామ‌య్య‌కు రాజ్య‌స‌భ టికెట్ అని ప్ర‌చారం జరిగింది.

ఈ మేర‌కు రామ‌య్య కూడా రెడీ అయ్యారు. నామినేష‌న్ వేద్దామ‌ని అనుకున్నారు. త‌న స్టైల్‌లో క్రాప్ స‌రిచేసుకున్నారు. తీరా చూస్తే సీఎం ర‌మేష్‌కు టికెట్ పోయింది. ఆయ‌న త‌ర్వాత క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌ను పెద్ద‌ల స‌భ‌కు పంపారు. ఏమైనా అంటే ఢిల్లీలో విజ‌య‌సాయిరెడ్డిని ఢీ కొనాలంటే వ‌ర్ల స‌రిపోర‌ని… క‌న‌క‌మేడ‌ల‌ను పంపారు.

తీరా ఆయ‌న ఈ రెండేళ్ల‌లో ఏం చేశారో అంద‌రికీ తెలుసు. అప్పుడు ప‌నికి రాని వ‌ర్ల రామ‌య్య‌… ఇప్పుడు ఎలా ప‌నికి వ‌స్తాడ‌ని తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల టైమ్‌లో ఓడిపోయే సీట్లు బీసీలకు కట్ట‌బెట్టే చంద్ర‌బాబు…ఇప్పుడు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఎస్సీల‌కు ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ బలం కేవ‌లం 23. ఇందులో గ‌న్న‌వ‌రం వంశీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాల గిరి పార్టీకి దూరంగా ఉంటున్నారు.

మిగిలింది 21 మంది. ఇందులో పయ్యావుల కేశ‌వ్‌, గంటా శ్రీనివాస‌రావు సైలెంట్‌. వారు పార్టీలో ఉన్న‌ట్లు తెలియ‌డం లేదు. ఇక ఇద్ద‌రు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరం పాటిస్తున్నారు. ఈ టైమ్‌లో టీడీపీకి పడే ఓట్లు 15కు మించ‌వు.

రాజ్య‌స‌భ‌కు పోటీ చేసి ప‌రువు పొగొట్టుకోవ‌డం త‌ప్ప‌…కొత్తగా క‌లిసి వ‌చ్చే అంశం ఏం లేద‌ని తెలుగు త‌మ్ముళ్లు అంటున్నారు. మ‌రీ 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే చంద్ర‌బాబుకు ఈ చాణ‌క్యం తెలియ‌దా? తెలియక కాదు… ఇతర సామాజిక వర్గాలతో ఆయన అప్పుడప్పుడూ అలా ఆడుకుంటారు…. అంతే!

First Published:  10 March 2020 8:40 PM GMT
Next Story