Telugu Global
NEWS

డ్రోన్ ఎఫెక్ట్... రేవంత్ ఒంటరైపోయాడా?

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మళ్లీ మొదటికొచ్చింది. తెలుగుదేశంలో ఉన్నంతకాలం వెలుగు వెలిగిన ఆయన… మారిన రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్ లో చేరి ఉన్నత పదవిని దక్కించుకున్నా… కాలం కలిసి రావడం లేదు. తోడుగా వచ్చే సీనియర్ నాయకులు లేరు. కష్టాల్లో ఉన్న సమయంలో వెనకేసుకువచ్చే అండాదండా లేదు. అధిష్టానం పరిస్థితి చూస్తుంటే.. వారికే ఎటూ పాలుపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. డ్రోన్ కెమెరాలను అనుమతి లేకుండా వాడి.. వ్యక్తి […]

డ్రోన్ ఎఫెక్ట్... రేవంత్ ఒంటరైపోయాడా?
X

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మళ్లీ మొదటికొచ్చింది. తెలుగుదేశంలో ఉన్నంతకాలం వెలుగు వెలిగిన ఆయన… మారిన రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్ లో చేరి ఉన్నత పదవిని దక్కించుకున్నా… కాలం కలిసి రావడం లేదు. తోడుగా వచ్చే సీనియర్ నాయకులు లేరు. కష్టాల్లో ఉన్న సమయంలో వెనకేసుకువచ్చే అండాదండా లేదు.

అధిష్టానం పరిస్థితి చూస్తుంటే.. వారికే ఎటూ పాలుపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. డ్రోన్ కెమెరాలను అనుమతి లేకుండా వాడి.. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించిన కేసులో.. ప్రస్తుతం రేవంత్ రిమాండ్ లో ఉన్నారు.

ఇలాంటి పరిస్థితిలో కూడా.. ఆయనకు మద్దతుగా నేతలు మాట్లాడ్డం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ఇదే.. రేవంత్ అనుచరుల్లో అంతులేని ఆగ్రహాన్ని వ్యక్తమయ్యేలా చేస్తోంది.

కష్టకాలంలో కూడా.. ప్రభావాన్ని చూపించి మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన నాయకుడికి ఇదేనా పార్టీ ఇచ్చే గౌరవం అన్న చర్చ కూడా వినిపిస్తోంది. కానీ.. రేవంత్ ఎదుగుదలపై ముందునుంచీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి…. ఇతర నేతలు కాస్త గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అందుకే.. రేవంత్ జైల్లో ఉన్నా కూడా.. వారితో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా అంతగా స్పందించినట్టు లేదు.

అందుకే…. రేవంత్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని…. ఆయన రాజకీయంగా వేసే అడుగులు మరింత జాగ్రత్తగా ఉండాలన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

First Published:  11 March 2020 2:25 AM IST
Next Story