Telugu Global
National

"ఇటలీ నుంచి ఆంధ్రాకు వచ్చారా... ఇంటికే పరిమితం కండి"

కరోనా ముప్పు.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తోంది. మనవాళ్లు అంతా బాగానే ఉన్నారు కదా అనుకుంటున్న తరుణంలో.. కేరళలో కనిపించిన మహమ్మారి దేశమంతా విస్తరించింది. పాజిటివ్ కేసుల్లో అర్థ సెంచరీ కొట్టింది. ఈ కారణంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన హాస్పిటళ్లలో ఐసోలేషన్ వార్డులు, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. తాజాగా.. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తిరుమలకు విదేశీ భక్తులు నాలుగు వారాల […]

ఇటలీ నుంచి ఆంధ్రాకు వచ్చారా... ఇంటికే పరిమితం కండి
X

కరోనా ముప్పు.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తోంది. మనవాళ్లు అంతా బాగానే ఉన్నారు కదా అనుకుంటున్న తరుణంలో.. కేరళలో కనిపించిన మహమ్మారి దేశమంతా విస్తరించింది. పాజిటివ్ కేసుల్లో అర్థ సెంచరీ కొట్టింది. ఈ కారణంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన హాస్పిటళ్లలో ఐసోలేషన్ వార్డులు, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.

తాజాగా.. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తిరుమలకు విదేశీ భక్తులు నాలుగు వారాల పాటు రావొద్దని టీటీడీ నుంచి సూచనలు వెలువడగా.. అలాంటిదే మరో కీలకమైన విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. విదేశాల నుంచి.. ముఖ్యంగా ఇటలీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారైతే.. కనీసం 14 రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఇటలీ నుంచి వచ్చి ఇళ్లకు చేరిన తర్వాత.. రెండు వారాల పాటు కచ్చితంగా ప్రత్యేక గదిలోనే ఉండాలని.. కనీసం బంధువులను కూడా కలవొద్దని ప్రభుత్వం కోరింది. ఇందుకు గల కారణాలను వివరించింది. చైనా తర్వాత ఇటలీలోనే కరోనా వ్యాప్తి, మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా.. ఈ సూచన చేస్తున్నట్టు చెప్పింది. ఇటీవల.. ఇటలీ నుంచి 75 మంది రాష్ట్రానికి వచ్చినట్టు గుర్తించామని.. వారిలో కొందరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపింది.

ఇటలీ మాత్రమే కాకుండా.. విదేశాల నుంచి వస్తున్న వారందరిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. కరోనాను.. ఏ మార్గంలోనూ ఆంధ్రప్రదేశ్ గడప తొక్కకుండా చూస్తున్నట్టు చెప్పింది.

First Published:  11 March 2020 2:32 AM IST
Next Story