తిరుమలకు కరోనా ఎఫెక్ట్: 28 రోజులు భక్తులు రావొద్దన్న టీటీడీ
తిరుమలని కరోనా ప్రభావం తాకింది. ముందస్తుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారు.. టికెట్లు రద్దు చేసుకునే అవకాశం టీటీడీ వెబ్ సైట్ లో లేకపోవడంపై అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. ఈవో తో మాట్లాడి.. ఈ దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టికెట్లు రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని.. కేవలం కరోనా ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ధర్మారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావం కొండను తాకకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలపైనా.. ధర్మారెడ్డి అన్ని […]
తిరుమలని కరోనా ప్రభావం తాకింది. ముందస్తుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారు.. టికెట్లు రద్దు చేసుకునే అవకాశం టీటీడీ వెబ్ సైట్ లో లేకపోవడంపై అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. ఈవో తో మాట్లాడి.. ఈ దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
టికెట్లు రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని.. కేవలం కరోనా ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ధర్మారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావం కొండను తాకకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలపైనా.. ధర్మారెడ్డి అన్ని వివరాలు వెల్లడించారు.
కొండపైన రసాయనాలతో నిత్యం శుభ్రం చేయించేందుకు తగిన ప్రణాళికను అమలు చేస్తున్నట్టు చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. వేసవిలో భక్తుల సంఖ్య భారీగా ఉండే అవకాశం దృష్ట్యా.. తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మరోవైపు.. ఇతర దేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకూ టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. కరోనా ప్రభావం విస్తృతంగా ఉన్న కారణంగా.. 28 రోజుల పాటు విదేశీ భక్తులు తిరుమలకు రావొద్దని కోరింది.