Telugu Global
National

సుజనా.. రమేష్.. వెంకటేష్.. అంతా గప్ చుప్.. ఎందుకో?

ఆ ముగ్గురూ కొన్నేళ్ల క్రితం చక్రం తిప్పిన నేతలు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టి అమరావతి పోరాటం వరకూ గళం వినిపించిన పెద్దలు. కానీ.. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. టీడీపీ నుంచి ఆ ముగ్గురూ బీజేపీలో చేరిపోయారు. అయినా.. కొన్నిసార్లు ధైర్యం చేసి తమ గొంతుకను వినిపించారు. అమరావతికి మద్దతుగా సుజనా.. రాయలసీమకు మద్దతుగా టీజీ.. సీరియస్ గానే ప్రెస్ మీట్లు పెట్టారు. ఇంతలో స్థానిక సమరానికి గంట మోగింది. మిగతా పార్టీల్లాగే బీజేపీ […]

సుజనా.. రమేష్.. వెంకటేష్.. అంతా గప్ చుప్.. ఎందుకో?
X

ఆ ముగ్గురూ కొన్నేళ్ల క్రితం చక్రం తిప్పిన నేతలు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టి అమరావతి పోరాటం వరకూ గళం వినిపించిన పెద్దలు. కానీ.. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. టీడీపీ నుంచి ఆ ముగ్గురూ బీజేపీలో చేరిపోయారు. అయినా.. కొన్నిసార్లు ధైర్యం చేసి తమ గొంతుకను వినిపించారు. అమరావతికి మద్దతుగా సుజనా.. రాయలసీమకు మద్దతుగా టీజీ.. సీరియస్ గానే ప్రెస్ మీట్లు పెట్టారు.

ఇంతలో స్థానిక సమరానికి గంట మోగింది. మిగతా పార్టీల్లాగే బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పాగా వేసేందుకు ఆరాటపడుతోంది. జనసేనతో కలిసి సమరానికి సై అంటోంది. కన్నా, జీవీఎల్, పురంధేశ్వరితో కూడిన త్రయం.. ఈ దిశగా సమన్వయం చేస్తోంది. ఇంతటి కీలక సందర్భంలో.. సుజనా, టీజీ, రమేష్ తెరపై కనిపించకపోవడం.. వారికి బీజేపీలో ఉన్న ప్రాధాన్యాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తోంది.

ఆ ముగ్గురూ ఇప్పటికీ చంద్రబాబుకు అనుయాయులుగానే ఉన్నారన్న అభిప్రాయం కావొచ్చు.. బీజేపీ దారిలో కాకుండా వ్యక్తిగత దారిలో నడుస్తున్నారన్న అనుమానం కావొచ్చు. కారణం ఏదైనా.. పార్టీలో వాళ్లను కుక్కిన పేనులా ఓ మూలన ఉండేలా.. బీజేపీ నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ ముగ్గురి నుంచి చంద్రబాబుకు ఎలాంటి సహకారం అందకుండా జాగ్రత్త పడుతోంది.

అందుకే ఎన్నికల బాధ్యతలను.. తమకు నమ్మకంగా ఉండే నేతలకే అప్పగించినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే.. ఆ ముగ్గురికీ.. అందులో కనీసం ఒకరిద్దరికి.. ముందు ముందు ఇబ్బందులేనన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయని…. ఏపీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఢిల్లీ బీజేపీ వర్గాల్లోనూ బలంగా వినిపిస్తోంది.

First Published:  10 March 2020 12:32 AM IST
Next Story