Telugu Global
NEWS

పులివెందులలో టీడీపీ ఖాళీ... వైసీపీలోకి సతీష్ రెడ్డి !

పులివెందుల అంటేనే వైఎస్ ఫ్యామిలీ అడ్డా. అక్కడ గత కొన్ని ఏండ్లుగా వైఎస్ ఫ్యామిలీనే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా వైఎస్ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే దానికే ఓటు వేసే వాళ్లు. వైఎస్ఆర్ ఉన్న కాలంలో అక్కడ కాంగ్రెస్ పార్టీదే హవా. ప్రస్తుతం జగన్ హయాంలో వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉంది. సీఎం జగన్ గెలిచింది కూడా పులివెందుల నుంచే అని అందరికీ తెలుసు. ఇక చంద్రబాబు పులివెందులలో మీ పార్టీని ఓడిస్తా […]

పులివెందులలో టీడీపీ ఖాళీ... వైసీపీలోకి సతీష్ రెడ్డి !
X

పులివెందుల అంటేనే వైఎస్ ఫ్యామిలీ అడ్డా. అక్కడ గత కొన్ని ఏండ్లుగా వైఎస్ ఫ్యామిలీనే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా వైఎస్ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే దానికే ఓటు వేసే వాళ్లు. వైఎస్ఆర్ ఉన్న కాలంలో అక్కడ కాంగ్రెస్ పార్టీదే హవా. ప్రస్తుతం జగన్ హయాంలో వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉంది. సీఎం జగన్ గెలిచింది కూడా పులివెందుల నుంచే అని అందరికీ తెలుసు.

ఇక చంద్రబాబు పులివెందులలో మీ పార్టీని ఓడిస్తా అంటూ గతంలో వైఎస్ఆర్‌పై, ఆ తర్వాత జగన్‌పై సవాల్ విసిరారు. చంద్రబాబు అనుచరుడిగా సతీష్ కుమార్ రెడ్డి అక్కడి టీడీపీకి ప్రాతినిథ్యం వహించారు. ప్రతీ ఎన్నికలో టీడీపీ తరపున సతీష్ రెడ్డే అభ్యర్థి. కాని ఆయనకు ఎప్పుడూ ఓటమే. గతంతో మాజీ శాసన మండలి డిప్యుటీ చైర్మన్, టీడీపీకి వీరాభిమానిగా ఉన్న సతీష్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం(మార్చి 10) ఉదయం వేంపల్లెలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ… తాను టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. గత కొన్నేండ్లుగా వైఎస్ ఫ్యామిలీతో తలపడుతున్న తనకు టీడీపీలో సరైన ఆదరణ లభించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనసు చంపుకొని టీడీపీలో ఉండలేనని ఆయన చెప్పారు.

వైఎస్ ఫ్యామిలీతో కొట్లాడేకంటే.. వారితో సన్నిహితంగా ఉంటేనే మేలని గ్రహించినట్లు సతీష్ రెడ్డి చెప్పారు. అందుకే ఈ నెల 13న తాను వైసీపీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. సతీష్ రెడ్డి వైసీపీలో చేరితే ఇక పులివెందులలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయినట్లే.

First Published:  10 March 2020 4:28 AM GMT
Next Story