Telugu Global
NEWS

ధోనీకి ద్వారాలు మూసుకుపోలేదు

ఐపీఎల్ లో రాణిస్తే ప్రపంచకప్ చాన్స్ భారత క్రికెట్ మేరునగధీరుడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారతజట్టు ద్వారాలు మూసుకుపోలేదని…బీసీసీఐ ఎంపిక సంఘం కొత్త చైర్మన్ సునీల్ జోషీ పరోక్షంగా సంకేతాలిచ్చాడు. ధోనీ ఎంపిక విషయంలో గత ఎంపిక సంఘం అనుసరించిన విధానాన్నే సునీల్ జోషీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సైతం కొనసాగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి. గత ఏడుమాసాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న వెటరన్ మహేంద్రసింగ్ ..ఈనెల 29న ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్లో […]

ధోనీకి ద్వారాలు మూసుకుపోలేదు
X
  • ఐపీఎల్ లో రాణిస్తే ప్రపంచకప్ చాన్స్

భారత క్రికెట్ మేరునగధీరుడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారతజట్టు ద్వారాలు మూసుకుపోలేదని…బీసీసీఐ ఎంపిక సంఘం కొత్త చైర్మన్ సునీల్ జోషీ పరోక్షంగా సంకేతాలిచ్చాడు. ధోనీ ఎంపిక విషయంలో గత ఎంపిక సంఘం అనుసరించిన విధానాన్నే సునీల్ జోషీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సైతం కొనసాగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి.

గత ఏడుమాసాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న వెటరన్ మహేంద్రసింగ్ ..ఈనెల 29న ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్లో స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా సత్తా చాటుకోగలిగితే..ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో తిరిగి చోటు కల్పించాలని ఎంపిక సంఘం భావిస్తోంది.

కోచ్, కెప్టెన్లదీ అదే మాట….

ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్- నవంబర్ మాసాలలో జరిగే 2020 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు అపారఅనుభవం ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అవసరం ఎంతో ఉందని కెప్టెన్ విరాట్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవి శాస్త్రి గట్టిగా నమ్ముతున్నారు. అలాగని…ధోనీని నేరుగాజట్టులోకి తీసుకొనే అవకాశంలేదని, ఐపీఎల్ ద్వారా సత్తా చాటుకొని తీరాల్సిందేనని తేల్చిచెప్పారు.

వన్డే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత నుంచి క్రికెట్ నుంచి విరామం తీసుకొన్న ధోనీ…2020 ఐపీఎల్ సన్నాహాల ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చాడు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా వారంరోజుల క్రితమే తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలపడంతో పాటు…గత సీజన్లో ఫైనల్స్ చేర్చిన మహేంద్రసింగ్ ధోనీ..స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే…భారతజట్టులో తిరిగి చోటు సంపాదించడం ఏమంత కష్టం కాబోదు.

2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 మినీ ప్రపంచకప్ లు భారత్ కు అందించిన అరుదైన ఘనత కెప్టెన్ గా ధోనీకి ఉంది. గొప్పవ్యూహకర్తగా, మ్యాచ్ ను గొప్పగా ముగించే మొనగాడిగా, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా నిబ్బరంగా ఉండగలిగే ఆటగాడిగా పేరున్న ధోనీకి…యువవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ తగిన వారసుడు కాదని తేలిపోయింది.కెఎల్ రాహుల్ లాంటి అసాధారణ ఆటగాడు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా ఉన్నా…ధోనీ అవకాశాలు ఇప్పటికీ సజీవంగానే ఉండటం విశేషం.

First Published:  10 March 2020 2:51 AM IST
Next Story