Telugu Global
NEWS

రంజీ ఫైనల్లో బెంగాల్ కు సౌరాష్ట్ర్ర సవాల్

రాజ్ కోట వేదికగా టైటిల్ సమరం భారత దేశవాళీ క్రికెట్ కే అతిపెద్ద టోర్నీ (2019-2020 ) రంజీ ఫైనల్స్ సమరానికి రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం పూర్తిస్థాయిలో సిద్దమయ్యింది. నేటినుంచి ఐదురోజులపాటు జరిగే ఈ టైటిల్ సమరంలో మాజీ చాంపియన్లు బెంగాల్, సౌరాష్ట్ర్ర ఢీ అంటే ఢీ అంటున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర్రాలు, ప్రాంతాలకు చెందిన 30కి పైగా జట్లు రంజీలీగ్ లో తలపడితే చివరకు సౌరాష్ట్ర్ర, బెంగాల్ జట్లు మాత్రమే సెమీస్ చేరుకోగలిగాయి. […]

రంజీ ఫైనల్లో బెంగాల్ కు సౌరాష్ట్ర్ర సవాల్
X
  • రాజ్ కోట వేదికగా టైటిల్ సమరం

భారత దేశవాళీ క్రికెట్ కే అతిపెద్ద టోర్నీ (2019-2020 ) రంజీ ఫైనల్స్ సమరానికి రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం పూర్తిస్థాయిలో సిద్దమయ్యింది.

నేటినుంచి ఐదురోజులపాటు జరిగే ఈ టైటిల్ సమరంలో మాజీ చాంపియన్లు బెంగాల్, సౌరాష్ట్ర్ర ఢీ అంటే ఢీ అంటున్నాయి.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర్రాలు, ప్రాంతాలకు చెందిన 30కి పైగా జట్లు రంజీలీగ్ లో తలపడితే చివరకు సౌరాష్ట్ర్ర, బెంగాల్ జట్లు మాత్రమే సెమీస్ చేరుకోగలిగాయి.

గుజరాత్ పైన సౌరాష్ట్ర్ర, కర్ణాటకపైన బెంగాల్ జట్లు విజయాలు సాధించడం ద్వారా ఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి.
13 ఏళ్ల తర్వాత ఫైనల్లో బె్ంగాల్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత…బెంగాల్ రంజీ జట్టు ఆటతీరే మారిపోయింది. పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది.

మహ్మద్ షమీ, వృద్ధిమాన్ సాహా లాంటి భారత స్టార్ ప్లేయర్లతో పాటు మనోజ్ తివారీ, పోరెల్, ముఖేశ్ కుమార్ ఆటగాళ్ళతో అత్యంత పటిష్టంగా తయారయ్యింది.

సెమీఫైనల్లో పవర్ ఫుల్ కర్ణాటకను అలవోకగా చిత్తు చేయడం ద్వారా 13 సంవత్సరాల విరామం తర్వాత ఫైనల్స్ కు చేరుకోగలిగింది.

13 ఫైనల్స్ లో రెండే టైటిల్స్…

ప్రస్తుత రంజీ ఫైనల్స్ కు ముందు వరకూ…బెంగాల్ జట్టుకు 13సార్లు రంజీట్రోఫీ ఫైనల్స్ ఆడి…కేవలం రెండుసార్లు మాత్రమే టైటిల్ నెగ్గిన అనుభవం ఉంది.

రంజీ రికార్డులను ఓసారి చూస్తే…అత్యధికంగా ముంబైజట్టు 46 ఫైనల్స్ ఆడి 41సార్లు విజేతగా నిలిచింది. చివరిసారిగా 2015-16 సీజన్లో టైటిల్ అందుకొంది. మొత్తం 89.10 విజయశాతాన్ని నమోదు చేసింది.

తమిళనాడు జట్టు 12 ఫైనల్స్ లో రెండు విజయాలు, రాజస్థాన్ 10 పైనల్స్ లో 2 విజయాలు, మధ్యప్రదేశ్ 11 ఫైనల్స్ లో 4 విజయాలు, ఢిల్లీ 15 ఫైనల్స్ లో 7 విజయాలు, కర్ణాటక 14 ఫైనల్స్ లో 8 విజయాలు సమోదు చేశాయి.

వరుసగా రెండోసారి పైనల్లో సౌరాష్ట్ర్ర..

మరోవైపు మాజీ చాంపియన్ సౌరాష్ట్ర్ర జట్టు వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరడం ద్వారా మరోసారి టైటిల్ కు గురిపెట్టింది. భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా, షెల్డన్ జాక్సన్, ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. గత ఎనిమిదిసీజన్లలో నాలుగుసార్లు ఫైనల్స్ చేరిన సౌరాష్ట్ర్ర ఒక్కసారి మాత్రమే టైటిల్ అందుకోగలిగింది.

రవీంద్ర జడేజా లాంటి కీలక ఆటగాడు లేకుండానే సౌరాష్ట్ర్ర జట్టు…స్థానం బలంతో హోంగ్రౌండ్ వేదికగా టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.

First Published:  9 March 2020 2:40 AM IST
Next Story