జమ్మలమడుగులో మారుతున్న రాజకీయం.... వైసీపీలోకి రామసుబ్బారెడ్డి !
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ కి ఝలక్‌లు మీద ఝలక్‌లు తగలబోతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లు సమాచారం. తాజాగా ఈ చేరికలకు జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రామసుబ్బారెడ్డి చేరికపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డితో […]
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ కి ఝలక్‌లు మీద ఝలక్‌లు తగలబోతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లు సమాచారం. తాజాగా ఈ చేరికలకు జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రామసుబ్బారెడ్డి చేరికపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డితో పాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. వీరి చేరికతో జమ్మలమడుగులో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లే.
ఇటు విశాఖలో కూడా వైసీపీ వైపు పలువురు టీడీపీ నేతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావును పార్టీలోకి రావాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ఆహ్వానించారట. ఆయన ఆలోచించి చెబుతానని చెప్పారట. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీ మారేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. రేపోమాపో వీరి కండువా మార్పిడి కార్యక్రమం ఉంటుందని సమాచారం. వీరితో పాటు జనసేన మహిళా నాయకురాలు కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
ఇటు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా పార్టీ మారే సూచనలు కన్పిస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో వ్యతిరేకించిన టైమ్‌లోనే డొక్కా పార్టీతో విభేదించారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈరోజు ఉదయం డొక్కా టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన ఇవాళ జగన్‌ను కలిసే అవకాశం ఉంది.
విశాఖ, కడపలోనే కాకుండా… పలు జిల్లాలలో కూడా పార్టీ మారేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారట. దీంతో ఆ పార్టీకి భారీగా దెబ్బ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్న టీడీపీ పెద్దలకు…. నేతల వలసతో మరింత ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి.