Telugu Global
NEWS

పులివెందుల‌లో చేతులెత్తేసిన టీడీపీ !

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేషన్ల ప‌ర్వం మొద‌లైంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల సంద‌డి ప్రారంభమైంది. అయితే క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో మాత్రం పోటీకి ముందే తెలుగు త‌మ్ముళ్లు వెన‌క‌డుగు వేశారు. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక స్థంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కోసం ఏర్పాటు చేసిన స‌మావేశంలో పార్టీ ఇంచార్జ్ స‌తీష్‌ రెడ్డి ఇదే విష‌యం చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని పార్టీ స్థానిక నేత‌ల […]

పులివెందుల‌లో చేతులెత్తేసిన టీడీపీ !
X

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేషన్ల ప‌ర్వం మొద‌లైంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల సంద‌డి ప్రారంభమైంది. అయితే క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో మాత్రం పోటీకి ముందే తెలుగు త‌మ్ముళ్లు వెన‌క‌డుగు వేశారు.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక స్థంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కోసం ఏర్పాటు చేసిన స‌మావేశంలో పార్టీ ఇంచార్జ్ స‌తీష్‌ రెడ్డి ఇదే విష‌యం చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని పార్టీ స్థానిక నేత‌ల ఎదుట త‌న అభిప్రాయాన్ని వ్య‌క్త ప‌రిచారు.

ఇప్ప‌టికే చంద్ర‌బాబుని క‌లిసి వ‌చ్చిన స‌తీష్‌రెడ్డి… పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు. బాబు డైరెక్ష‌న్‌లోనే ఆయ‌న పోటీ నుంచి విర‌మించుకున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల నుంచి పులివెందులలో తాము గెలుస్తామ‌ని… త‌మ‌కు ప‌ట్టు వ‌చ్చింద‌ని ప్ర‌గాల్భాలు ప‌గిలిన టీడీపీ నేత‌లు…ఇప్పుడు పోటీకి కూడా ముందుకు రాక‌పోవ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.

ఒక్క పులివెందులే కాదు. ఏపీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి. ఇంచార్జ్‌ల్లో కొంద‌రు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ కావ‌డం లేదు. మ‌రికొంద‌రు పోటీ చేసినా ఏదో నామ్ కే వాస్తే టైపు నామినేష‌న్ వేయాల‌ని చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి ఇంకా టీడీపీ కోలుకోలేద‌నడానికి ఈ ఎన్నిక‌ల్లో పోటీకి విముఖ‌త చూప‌డ‌మే నిదర్శనం అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు .

First Published:  9 March 2020 12:09 AM GMT
Next Story