Telugu Global
NEWS

సఫారీలతో వన్డే సిరీస్ కు భారతజట్టు

భువీ, పాండ్యా, శిఖర్ ధావన్ లకు పిలుపు భారత్ వేదికగా సౌతాఫ్రికాతో మార్చి 12 నుంచి జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్, ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి చోటు సంపాదించారు. గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో గత కొంతకాలంగా భారతజట్టుకు దూరమైన ఈ ముగ్గురు ఆటగాళ్లు..న్యూజిలాండ్ పర్యటనకు సైతం ఆందుబాటులో లేకుండా పోయారు. […]

సఫారీలతో వన్డే సిరీస్ కు భారతజట్టు
X
  • భువీ, పాండ్యా, శిఖర్ ధావన్ లకు పిలుపు

భారత్ వేదికగా సౌతాఫ్రికాతో మార్చి 12 నుంచి జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్, ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి చోటు సంపాదించారు.

గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో గత కొంతకాలంగా భారతజట్టుకు దూరమైన ఈ ముగ్గురు ఆటగాళ్లు..న్యూజిలాండ్ పర్యటనకు సైతం ఆందుబాటులో లేకుండా పోయారు.

సునీల్ జోషీ ఎంపిక సంఘం చైర్మన్ గా ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో విరాట్ కొహ్ల, శిఖర్ ధావన్, పృథ్వీ షా, రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహాల్, జస్ ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభమన్ గిల్ ఉన్నారు.

శార్దూల్ ఠాకూర్, కేదార్ జాదవ్ జట్టులో స్థానం కోల్పోగా…మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చారు. సిరీస్ లోని తొలివన్డే మార్చి 12 న ధర్మశాల క్రికెట్ స్టేడియం వదికగా ప్రారంభమవుతుంది.

సిరీస్ లోని రెండో వన్డే మార్చి 15న లక్నో వేదికగాను, ఆఖరి వన్డేను మార్చి 18న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్వహిస్తారు.

ఆస్ట్ర్రేలియాతో కొద్దిరోజుల క్రితమే ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో 3-0తో నెగ్గిన సఫారీటీమ్….భారత్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

First Published:  9 March 2020 5:42 AM IST
Next Story