Telugu Global
CRIME

నాన్నను చూస్తా.... భద్రత ఇవ్వండి : అమృత

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు ఆదివారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇవాళ మిర్యాలగూడలో మారుతీరావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి మృతదేహాన్ని చివరి సారిగా చూసేందుకు తనకు పోలీసు భద్రత కావాలని అమృత కోరిందట. అయితే పోలీసులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలుపగా.. ఎట్టి పరిస్థితుల్లో అమృతను ఇక్కడకు రానివ్వమని, వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని […]

నాన్నను చూస్తా.... భద్రత ఇవ్వండి : అమృత
X

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు ఆదివారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇవాళ మిర్యాలగూడలో మారుతీరావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి మృతదేహాన్ని చివరి సారిగా చూసేందుకు తనకు పోలీసు భద్రత కావాలని అమృత కోరిందట.

అయితే పోలీసులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలుపగా.. ఎట్టి పరిస్థితుల్లో అమృతను ఇక్కడకు రానివ్వమని, వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని తెలిసింది. దీంతో పోలీసులు ఇదే విషయాన్ని అమృతకు చెప్పారు. అక్కడకు వెళ్తే దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.

ఇక, ఇవాళ మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతిమ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పట్టణంలో కూడళ్ల వద్ద పోలీసులు సివిల్ డ్రెస్‌లలో కాపలా కాస్తున్నారు. ప్రణయ్ ఇంటి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే తండ్రి మారుతీ రావును కడ చూపు చూడడానికి అమృత పోలీసుల అనుమతి అడగలేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

First Published:  9 March 2020 5:45 AM IST
Next Story