Telugu Global
NEWS

మహిళా దినోత్సవం రోజునే ప్రపంచకప్ ఫైనల్స్

మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ టైటిల్ సమరం ఆస్ట్రేలియా వేదికగా గతమూడువారాలుగా జరుగుతున్న ఈ దశాబ్దపు మహిళా తొలి ప్రపంచకప్ టీ-20 టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ స్టేడియం వేదికగా టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా, 4వ ర్యాంకర్ భారత్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అందరిచూపు భారత్ వైపే… మహిళా టీ-20 ప్రపంచకప్ చరిత్రలో…7వ ప్రయత్నంలో ఫైనల్స్ చేరిన భారతజట్టు..ఆరునూరైనా టైటి్ల నెగ్గాలన్న పట్టుదలతో ఉంది. గ్రూప్ […]

మహిళా దినోత్సవం రోజునే ప్రపంచకప్ ఫైనల్స్
X
  • మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ టైటిల్ సమరం

ఆస్ట్రేలియా వేదికగా గతమూడువారాలుగా జరుగుతున్న ఈ దశాబ్దపు మహిళా తొలి ప్రపంచకప్ టీ-20 టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది.

ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ స్టేడియం వేదికగా టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా, 4వ ర్యాంకర్ భారత్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

అందరిచూపు భారత్ వైపే…

మహిళా టీ-20 ప్రపంచకప్ చరిత్రలో…7వ ప్రయత్నంలో ఫైనల్స్ చేరిన భారతజట్టు..ఆరునూరైనా టైటి్ల నెగ్గాలన్న పట్టుదలతో ఉంది.

గ్రూప్ లీగ్ టాపర్ గా నిలవడంతో పాటు… ఇంగ్లండ్ తో జరగాల్సిన సెమీస్ వానదెబ్బతో రద్దు కావడంతో… టైటిల్ సమరానికి అర్హత సాధించిన భారతజట్టు డార్క్ హార్స్ హోదాలో బరిలోకి దిగింది.

సూపర్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టులో మెరుపు ఓపెనర్ల జోడీ స్మృతి మంధానా, టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ ప్రధాన అస్త్రంగా ఉంది.

యువప్లేయర్ జెమీమా రోడ్రిగేస్, తాన్యా భాటియా, వేద కృష్ణమూర్తి లాంటి బ్యాట్స్ విమెన్, బౌలింగ్ లో స్పిన్ అస్త్రాలు పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గయక్వాడ్, రాధా యాదవ్, పేస్ జోడీ శిఖా పాండే, అరుంధతి రెడ్డిల సత్తాపైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

కంగారూలవైపే రికార్డు…

ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియాకే భారత్ పైన మెరుగైన రికార్డు ఉంది. ఈ రెండుజట్లు ప్రస్తుత ప్రపంచకప్ పైనల్స్ కు ముందువరకూ 19సార్లు తలపడితే…కంగారూజట్టు 13, భారత్ 6 విజయాలు సాధించాయి. అయితే…గత ఐదుమ్యాచ్ ల్లో.. ఆస్ట్ర్రేలియాను మూడుసార్లు ఓడించిన రికార్డు భారత్ కు ఉంది. కంగారూజట్టు హోంఎడ్వాంటేజ్ తో పాటు ఘనమైన రికార్డుతో ఐదో ప్రపంచ టైటిల్ కు గురిపెట్టింది.

హాటుకేకుల్లా ప్రపంచకప్ టికెట్లు..

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో…అదీ ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే ప్రపంచకప్ ఫైనల్స్ నిర్వహిస్తున్న కారణంగా.. రికార్డుస్థాయిలో…గతంలో ఎన్నడూలేనంతగా 75 వేల టికెట్లు విక్రయమైనట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా..కోట్లాదిమంది అభిమానులు ఈ మ్యాచ్ ను ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించనున్నారు.

భారత మహిళలకు ప్రధాని ఆల్ ద బెస్ట్..

ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే…ప్రపంచకప్ పైనల్లో తొలిసారిగా తలపడుతున్న హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్, కెప్టెన్ విరాట్ కొహ్లీ..తమ తమ సందేశాల ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. సహజసిద్ధమైన ఆటతీరుతో ప్రపంచకప్ నెగ్గి స్వదేశానికి
తిరిగిరావాలని ఆకాక్షింంచారు.

కప్పు కొడితే భారీ ప్రైజ్ మనీ…

2020 మహిళా టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన జట్టు గతంలో ఎన్నడూ లేనంత మొత్తంలో ప్రైజ్ మనీ అందుకోనుంది.

2018 ప్రపంచకప్ విజేత జట్టు అందుకొన్న ప్రైజ్ మనీ కంటే ప్రస్తుత ప్రపంచకప్ విజేత.. 320 శాతం ఎక్కువ ప్రైజ్ మనీ అందుకోనున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

మొత్తం 2.6 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. గతంతో పోల్చిచూస్తే …స్పాన్సర్ల నుంచి మహిళా క్రికెట్ కు సైతం రాబడి పెరిగిందని, ఆదాయం పెరిగిన కారణంగానే ప్రపంచకప్ ప్రైజ్ మనీ సైతం భారీగా పెరిగిందని వివరణ ఇచ్చింది.

విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ చెక్ అందచేయనున్నారు. రన్నరప్ గా నిలిచిన జట్టు 5 లక్షల డాలర్లు నజరానాగా అందుకోనుంది.

గతంలో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పొందిన భారతజట్టు…ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ ఫైనల్లోనైనా విజేతగా నిలుస్తుందా? విశ్వవిజేతగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా?..తెలుసుకోవాలంటే మరికొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  8 March 2020 3:23 AM IST
Next Story