Telugu Global
NEWS

జగన్ చెప్పారంటూ... కేసీఆర్ తెలిపింది ఏంటో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా.. స్నేహం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో భాగంగానే.. తమ మధ్య ఉన్న చనువు కారణంగా.. తనకో కీలక విషయం తెలిసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లాల పెంపునకు సంబంధించిన స్పష్టమైన సమాచారం తనకు తెలిసిందని.. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో విపక్షాలకు చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచుకున్నాం కదా.. ఈ విషయంలో కాంగ్రెస్ […]

జగన్ చెప్పారంటూ... కేసీఆర్ తెలిపింది ఏంటో తెలుసా?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా.. స్నేహం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో భాగంగానే.. తమ మధ్య ఉన్న చనువు కారణంగా.. తనకో కీలక విషయం తెలిసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లాల పెంపునకు సంబంధించిన స్పష్టమైన సమాచారం తనకు తెలిసిందని.. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో విపక్షాలకు చెప్పారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచుకున్నాం కదా.. ఈ విషయంలో కాంగ్రెస్ నేతల తీరు ఏ మాత్రం సరిగా లేదని విమర్శించారు. భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాలు జిల్లాల విభజన చేసుకున్నా.. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చేయలేదని అన్నారు. కానీ.. తాజా పరిణామాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గురించి తనకో కీలక విషయం తెలిసిందని.. అది జగన్ తో మాట్లాడిన తర్వాతే తెలిసిందని అన్నారు.

అదేంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల సంఖ్య 25కు పెరగబోతోందట. అవును. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ విషయాన్ని కేసీఆర్.. తన తెలంగాణ శాసనసభలో వెల్లడించారు. అప్పటినుంచి.. ఆ కొత్త 12 జిల్లాలు ఏంటి? నిజంగానే ముఖ్యమంత్రి జగన్.. 13 జిల్లాలను 25 చేయబోతున్నారా? అన్నది చర్చనీయాంశమైంది. ఒకవేళ అలాంటి పనే జరిగితే.. అధికారులు, నిధులు, సిబ్బంది సమస్య తీరుతుందా.. అన్నది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే.. జిల్లాల సంఖ్య పెంపుపై చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే.. కుదిరితే.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాల్లోనే ఈ విషయంపై స్పష్టత రావచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

First Published:  8 March 2020 4:43 AM IST
Next Story