ఈ నాయకుడికి ఔర్ ఏక్ బార్.... రాజ్యసభ సీటు బరాబర్!
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. మొదటి విడతలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన నాయకుడు.. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ వాదన వినిపిస్తున్న నేత.. జాతీయ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్న నేత. ఇవి చాలు.. కె. కేశవరావు ప్రస్థానాన్ని తెలియజేసేందుకు. పీసీసీ చీఫ్ స్థాయికి కాంగ్రెస్ లో ఎదిగి… తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా… టీఆర్ఎస్ గూటికి చేరిన ఆయనకు… కేసీఆర్ మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా పోస్టును సృష్టించి […]
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. మొదటి విడతలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన నాయకుడు.. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ వాదన వినిపిస్తున్న నేత.. జాతీయ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్న నేత. ఇవి చాలు.. కె. కేశవరావు ప్రస్థానాన్ని తెలియజేసేందుకు. పీసీసీ చీఫ్ స్థాయికి కాంగ్రెస్ లో ఎదిగి… తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా… టీఆర్ఎస్ గూటికి చేరిన ఆయనకు… కేసీఆర్ మంచి ప్రాధాన్యతే ఇచ్చారు.
టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా పోస్టును సృష్టించి మరీ.. పార్టీలో తన పక్కన సీటును కేటాయించారు. రాజ్యసభకు పంపించి తగిన గౌరవాన్ని అందించారు. ఆ మర్యాదను.. కేకే కూడా కాపాడుకుంటూ వచ్చారు. కేసీఆర్ కు సన్నిహితుడిగా మెలుగుతూ నడుచుకున్నారు. ఆయన చెప్పింది చేసినట్టు వెళ్తూ.. తల్లో నాలుకలా వ్యవహరించారు. ఫలితంగా.. మరోసారి రాజ్యసభకు బాటలు పరుచుకున్నారు.
ఆయనకు.. టీఆర్ఎస్ తరఫున మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఖాయమన్న మాట.. అంతటా వినిపిస్తోంది. కేసీఆర్ ను స్వయంగా కలిసి.. సీటుపై హామీ పొందినట్టు స్పష్టమైన సమాచారం అందుతోంది. కానీ.. రాజకీయ సమీకరణాలను బలంగా విశ్వసించే కేసీఆర్.. ఎప్పుడు, ఎవర్ని అందలం ఎక్కిస్తారు.. ఎప్పుడు ఎవర్ని ఒక్కసారిగా దించుతారు అన్నది.. ఆయన కుటుంబ సభ్యులకూ తెలియదు.
అలాంటిది.. కేకేకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా.. అంటే ఏమో ఎవరికి తెలుసు.. అంటున్నారంతా. అందుకే.. ఈ విషయంలో ఆయన నిర్ణయమేంటో అధికారిక సమాచారం వచ్చేవరకూ ఆగడమే మంచిదని పార్టీ నేతలే భావిస్తున్నారు. మరోవైపు కేకే మాత్రం.. తనకు ఔర్ ఏక్ బార్.. రాజ్యసభ సీటు బరాబర్.. అని ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది.