న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న అశోక్ గజపతి!
మాన్సాస్ ట్రస్ట్ బోర్డు వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు.. పెదవి విప్పారు. తనను చైర్మన్ పదవి నుంచి తొలగించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనిలో పనిగా.. తన బంధువు, తాజాగా ఛైర్ పర్సన్ పదవి దక్కించుకున్న సంచయిత పైనా ఆయన విమర్శలు, ఆరోపణలు చేశారు. ఆమె ఆధార్ కార్డు పరిశీలిస్తే చాలు.. ఎక్కడ నివసిస్తుందో తెలుసుకోవచ్చునని అశోక్ గజపతి వ్యాఖ్యానించారు. అందరి సహకారంతో న్యాయపోరాటం చేసేందుకు […]
మాన్సాస్ ట్రస్ట్ బోర్డు వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు.. పెదవి విప్పారు. తనను చైర్మన్ పదవి నుంచి తొలగించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనిలో పనిగా.. తన బంధువు, తాజాగా ఛైర్ పర్సన్ పదవి దక్కించుకున్న సంచయిత పైనా ఆయన విమర్శలు, ఆరోపణలు చేశారు. ఆమె ఆధార్ కార్డు పరిశీలిస్తే చాలు.. ఎక్కడ నివసిస్తుందో తెలుసుకోవచ్చునని అశోక్ గజపతి వ్యాఖ్యానించారు.
అందరి సహకారంతో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నామని కూడా ఆయన సెలవిచ్చారు. ఇక్కడే.. ఓ పాయింట్ తేడా కొడుతోంది. అందరి సహకారం అంటే.. ఎందరి సహకారం.. అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ముఖ్యంగా.. చంద్రబాబు వంటి ఉద్ధండపిండానికే కలిసొచ్చే వారు కరువవుతున్నారంటే.. రాజకీయాలను మౌనంగా నిర్వహించే అశోక గజపతితో ఎవరు కలిసి వస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
అమరావతి విషయంలో చేస్తున్న పోరాటానికే.. పార్టీ నేతలు పూర్తి స్థాయిలో కలిసి రారు.. అలాంటిది.. వ్యక్తిగత సమస్య.. అది కూడా ఓ బోర్డు పదవికి సంబంధించిన విషయానికి… ఎందరు మద్దతిస్తారు? ఎలాంటి ప్రభావవంతమైన నాయకులు కలిసివస్తారు..? అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో చంద్రబాబు కలిసి వెళ్తారా.. వెళ్లరా.. అన్నదే ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ లో టాక్ ఆఫ్ ద పాయింట్ అయ్యింది.
కానీ.. అశోక్ గజపతి వేదన.. ఒంటరి రోదనగానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి పనిలో వారు.. ప్రజలకు దగ్గరయ్యేందుకు పోటీ పడుతున్న వేళ.. ఆయన న్యాయ పోరాటం గాల్లో కలిసేదిగానే కనిపిస్తోంది.