Telugu Global
National

వెంక‌న్న బ‌తికిపోయాడు... పూరీ జ‌గ‌న్నాథుడు ఇరుక్కున్నాడు

య‌స్‌బ్యాంక్ సంక్షోభం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నమైంది. డిపాజిట్‌ దారులు అల్లాడిపోతున్నారు. ఇటు స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ షేర్లు షేక్ అవుతున్నాయి. బ్యాంక్ దెబ్బ‌కు దేవుళ్లకు కూడా క‌ష్ట‌కాలం వ‌చ్చి ప‌డింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుపు చూపు ఎంతో మేలు చేసింది. య‌స్‌బ్యాంకు సంక్షోభంలో ప‌డింద‌ని గుర్తించిన ఆయ‌న‌… టీటీడీ డిపాజిట్లను స‌కాలంలో ఉప‌సంహ‌రించుకున్నారు. బ్యాంకులో ఉన్న రూ. 1300 కోట్ల డిపాజిట్లను ప్ర‌భుత్వ రంగ బ్యాంకులకు మ‌ళ్లించారు. టీడీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ రంగ‌బ్యాంకులను ప‌క్క‌న […]

వెంక‌న్న బ‌తికిపోయాడు... పూరీ జ‌గ‌న్నాథుడు ఇరుక్కున్నాడు
X

య‌స్‌బ్యాంక్ సంక్షోభం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నమైంది. డిపాజిట్‌ దారులు అల్లాడిపోతున్నారు. ఇటు స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ షేర్లు షేక్ అవుతున్నాయి. బ్యాంక్ దెబ్బ‌కు దేవుళ్లకు కూడా క‌ష్ట‌కాలం వ‌చ్చి ప‌డింది.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుపు చూపు ఎంతో మేలు చేసింది. య‌స్‌బ్యాంకు సంక్షోభంలో ప‌డింద‌ని గుర్తించిన ఆయ‌న‌… టీటీడీ డిపాజిట్లను స‌కాలంలో ఉప‌సంహ‌రించుకున్నారు. బ్యాంకులో ఉన్న రూ. 1300 కోట్ల డిపాజిట్లను ప్ర‌భుత్వ రంగ బ్యాంకులకు మ‌ళ్లించారు.

టీడీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ రంగ‌బ్యాంకులను ప‌క్క‌న పెట్టి నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డ‌బ్బుల‌ను డిపాజిట్ చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రిగిన ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన వైవి సుబ్బారెడ్డి వెంట‌నే ఆ డిపాజిట్ల‌ను ప్ర‌భుత్వ రంగ బ్యాంకులకు మ‌ళ్లించారు. దీంతో ఇప్పుడు య‌స్ బ్యాంక్ సంక్షోభంలో టీటీడీ చిక్కుకోలేదు.

అయితే పూరీ జ‌గ‌న్నాథుడు డిపాజిట్లు మాత్రం య‌స్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కాయి. 545 కోట్ల రూపాయ‌ల డిపాజిట్లు ఇప్పుడు బ్యాంక్‌లోనే ఉండిపోయాయి. ప్లెక్సీ అకౌంట్‌లో ఉన్న 47 కోట్ల‌ను ఇటీవ‌ల డ్రా చేశారు. కానీ డిపాజిట్ల‌ను విత్ డ్రా చేసుకోలేక‌పోయారు. మార్చి 16, మార్చి 29న డిపాజిట్ల గ‌డువు ముగిసిన వెంట‌నే 545 కోట్ల రూపాయ‌ల‌ను రెండు ధ‌పాలుగా ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు మ‌ళ్లించాల‌ని అనుకున్నారు. తీరా ఇప్పుడు సంక్షోభం చుట్టుముట్ట‌డంతో ఏం చేయలేని ప‌రిస్థితి. ప్ర‌తి అకౌంట్ నుంచి 50 వేల రూపాయ‌ల కంటే ఎక్కువ విత్ డ్రా చేయొద్ద‌ని ఆర్‌బీఐ మారిటోరియం విధించింది. దీంతో పెద్ద ఎత్తున డ‌బ్బులను ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌లేని ప‌రిస్థితి.

దేవ‌స్థానం అధికారులు పెద్ద ఎత్తున డ‌బ్బును ప్రైవేటు బ్యాంకులో ఎలా డిపాజిట్ చేశార‌ని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఓ బ్యాంకులో ఎలా డిపాజిట్ చేశార‌నే విష‌యంపై విచార‌ణ‌కు ఆదేశించారు. మొత్తానికి వెంక‌న్న బ‌తికిపోయాడు. పూరీ జ‌గన్నాథుడు ఇరుక్కుపోయాడు.

First Published:  7 March 2020 2:54 AM IST
Next Story