Telugu Global
NEWS

తెలుగురాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లేన‌ట్లేనా?

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌… 2014 నుంచి తెలుగురాష్ట్రాల రాజ‌కీయ నేత‌లు ఎదురుచూస్తున్న అంశం. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో ఈ అంశానికి చోటు క‌ల్పించారు. నియోజ‌క‌ వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జ‌న చేయాల‌ని సూచించారు. ఏపీలో 175 సీట్ల‌ను 225 పెంచాల‌ని సూచించారు. తెలంగాణ‌లో 119 సీట్ల‌ను 153 సీట్ల‌కు పెంచాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలో రాశారు. నియోజ‌క‌ వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లెక్క‌ల ప్రకారం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి రెండు సీట్లు పెర‌గాలి. ఈ లెక్క ప్రకారం ఉమ్మ‌డి జిల్లాలో భారీగా కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డ‌తాయి. […]

తెలుగురాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లేన‌ట్లేనా?
X

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌… 2014 నుంచి తెలుగురాష్ట్రాల రాజ‌కీయ నేత‌లు ఎదురుచూస్తున్న అంశం. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో ఈ అంశానికి చోటు క‌ల్పించారు. నియోజ‌క‌ వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జ‌న చేయాల‌ని సూచించారు. ఏపీలో 175 సీట్ల‌ను 225 పెంచాల‌ని సూచించారు. తెలంగాణ‌లో 119 సీట్ల‌ను 153 సీట్ల‌కు పెంచాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలో రాశారు.

నియోజ‌క‌ వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లెక్క‌ల ప్రకారం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి రెండు సీట్లు పెర‌గాలి. ఈ లెక్క ప్రకారం ఉమ్మ‌డి జిల్లాలో భారీగా కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డ‌తాయి. కొత్త నాయ‌కులు వస్తారు. దీంతో నేత‌ల‌కు స‌ర్దుబాట్లు చేయొచ్చ‌ని రాజ‌కీయ పార్టీలు పొలిటిక‌ల్ లెక్క‌లు వేశాయి. కేంద్ర‌ం మాత్రం త‌న‌కు ఉన్న రాజ‌కీయ లెక్క‌ల‌తో అడ్డువేస్తూ వ‌స్తోంది.

ఇప్పుడు తాజాగా జమ్ము-కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పునర్వ్యవస్థీకరణకు డీలిమిటెషన్ కమిషన్‌ను కేంద్రం వేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్‌కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

దీంతో పాటే తెలంగాణ‌, ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు క‌మిటీ నియ‌మిస్తార‌ని ఇక్క‌డి నేత‌లు ఆశించారు. తెలంగాణ‌, ఏపీ ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డంతో ఇక ఇప్ప‌ట్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ఉండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. పున‌ర్విభ‌జ‌న‌పై నేత‌ల ఆశలపై కేంద్రం నీళ్లు చ‌ల్లింది.

First Published:  6 March 2020 10:30 PM GMT
Next Story