Telugu Global
Cinema & Entertainment

"సైలెన్స్"లో వయొలెన్స్

ఎట్టకేలకు నిశ్శబ్దం సినిమాలో కదలికి వచ్చింది. అనుష్క నటించిన ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ అయితే చెప్పారు కానీ టైటిల్ కు తగ్గట్టు ఎలాంటి ప్రచారం చేయకుండా అంతా సైలెంట్ గా కూర్చున్నారు. అలా కొన్నాళ్లుగా స్తబ్దుగా మారిన ఈ సినిమా వ్యవహారం ఎట్టకేలకు ఊపందుకుంది. శుక్రవారం ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశారు. నాని చేతుల మీదుగా విడుదలైన నిశ్శబ్దం ట్రయిలర్ పేరుకు తగ్గట్టుగా నిశ్శబ్దంగానే ఉంది. కానీ భయంకరంగా కూడా ఉంది. […]

సైలెన్స్లో వయొలెన్స్
X

ఎట్టకేలకు నిశ్శబ్దం సినిమాలో కదలికి వచ్చింది. అనుష్క నటించిన ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ అయితే చెప్పారు కానీ టైటిల్ కు తగ్గట్టు ఎలాంటి ప్రచారం చేయకుండా అంతా సైలెంట్ గా కూర్చున్నారు. అలా కొన్నాళ్లుగా స్తబ్దుగా మారిన ఈ సినిమా వ్యవహారం ఎట్టకేలకు ఊపందుకుంది. శుక్రవారం ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశారు.

నాని చేతుల మీదుగా విడుదలైన నిశ్శబ్దం ట్రయిలర్ పేరుకు తగ్గట్టుగా నిశ్శబ్దంగానే ఉంది. కానీ భయంకరంగా కూడా ఉంది. ఓ పాడుబ‌డిన ఇంట్లో ఉన్న అనుష్క‌, మాధ‌వ‌న్ కొన్ని భ‌యాన‌కమైన విష‌యాల‌ు చూస్తార‌ు. అస‌లు ఆ ఇంట్లో ఏముందోన‌ని పోలీసులు అన్వేష‌ణ‌తోనే సినిమా ర‌న్ అవుతుంది. మరో హీరోయిన్ అంజ‌లి అమెరిక‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. ఆమె అనుష్క‌కి ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అనుష్క మూగ-చెవిటి అమ్మాయి సాక్షి పాత్రలో న‌టించింది. ట్రయిలర్ లో ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

అస‌లు ఘోస్ట్ హౌస్ ఏంటి? అందులో జ‌రిగే క‌థేంటి? అనేది ఈ ‘నిశ్శ‌బ్దం’ కథ. ఏప్రిల్ 2న సినిమా థియేటర్లలోకి రానుంది. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకుడు.

Here it is Much awaited #NishabdhamTrailer ?R Madhavan Anjali Shalini Subbaraju Hemant Madhukar Kona VenkatVivek Kuchibhotla People Media Factory Gopi Sunder

Publiée par Anushka Shetty sur Jeudi 5 mars 2020

First Published:  7 March 2020 2:57 AM IST
Next Story