ఐపీఎల్ వేదికలకు రెట్టింపు ఆదాయం
హైదరాబాద్ క్రికెట్ సంఘానికి మ్యాచ్ కు కోటి ఐపీఎల్ 13వ సీజన్ నుంచి..ఆతిథ్య వేదికలకు రెట్టింపు ఆదాయం దక్కనుంది. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2019 12వ సీజన్ వరకూ దేశంలోని 11 క్రికెట్ గ్రౌండ్స్ లో మ్యాచ్ లు నిర్వహిస్తూ వచ్చారు. వివిధ ఫ్రాంచైజీలు …దేశవ్యాప్తంగా విఖ్యాత క్రికెట్ స్టేడియాలను తమతమ హోంగ్రౌండ్స్ గా మలచుకొని మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తూ వస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చెందిన రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం…హైదరాబాద్ సన్ రైజర్స్ […]
- హైదరాబాద్ క్రికెట్ సంఘానికి మ్యాచ్ కు కోటి
ఐపీఎల్ 13వ సీజన్ నుంచి..ఆతిథ్య వేదికలకు రెట్టింపు ఆదాయం దక్కనుంది. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2019 12వ సీజన్ వరకూ దేశంలోని 11 క్రికెట్ గ్రౌండ్స్ లో మ్యాచ్ లు నిర్వహిస్తూ వచ్చారు. వివిధ ఫ్రాంచైజీలు …దేశవ్యాప్తంగా విఖ్యాత క్రికెట్ స్టేడియాలను తమతమ హోంగ్రౌండ్స్ గా మలచుకొని మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తూ వస్తున్నాయి.
హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చెందిన రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం…హైదరాబాద్ సన్ రైజర్స్ కు హోంగ్రౌండ్ గా ఉంటే… ముంబై ఫ్రాంచైజీకి వాంఖెడీ స్టేడియం, బెంగళూరుకు చిన్నస్వామి స్టేడియం, చెన్నైకి చెపాక్ స్టేడియం, కోల్ కతాకు ఈడెన్ గార్డెన్స్, పంజాబ్ కు మొహాలీ, జైపూర్ కు సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, ఢిల్లీ కి ఫిరోజ్ షా కోట్లా స్టేడియం హోంగ్రౌండ్స్ గా నిలిచాయి.
50 లక్షల నుంచి కోటి రూపాయలు…
ఐపీఎల్ ఒక్కో సీజన్లో ఒక్కో ఫ్రాంచైజీ హోంగ్రౌండ్ కనీసం 7 మ్యాచ్ లకు వేదికగా నిలుస్తూ వస్తోంది. ఒక్కో మ్యాచ్ ను నిర్వహించినందుకు ఆయా క్రికెట్ సంఘాలకు ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఇప్పటి వరకూ 30 లక్షల రూపాయలు, ఐపీఎల్ బోర్డు 30 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తూ వస్తున్నాయి.
అయితే…ఐపీఎల్ 13వ సీజన్ నుంచి ఈ మొత్తాన్ని 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలకు పెంచారు. ఇక నుంచి ఒక్కో మ్యాచ్ కు ఐపీఎల్ బోర్డు 50 లక్షలు, ఫ్రాంచైజీ యాజమాన్యం 50 లక్షల రూపాయల వంతున చెల్లించనున్నాయి.
హైదరాబాద్ ఫ్రాంచైజీకి హోంగ్రౌండ్ గా ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం 2020 ఐపీఎల్ సీజన్లో కనీసం ఏడుమ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుండడం ద్వారా 7 కోట్ల రూపాయలు..అద్దె రూపంలో అందుకోనుంది.
ఐపీఎల్ 13వ సీజన్ మార్చి 29న ముంబై వాంఖెడీ స్టేడియంలో ప్రారంభమై 7వారాల అనంతరం తిరిగి ముంబై వేదికగానే ముగియనుంది.