Telugu Global
NEWS

గవర్నర్ తమిళిసైతో పంతం నెగ్గించుకున్న కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేయాల్సిన ప్రసంగం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని ఆమెకు పెద్ద ఇబ్బందిని నివారించారు. శుక్రవారం బడ్జెట్ సమావేశంలో మొదటి రోజు రాష్ట్ర శాసనసభలో ఈ చిత్రం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటీజన్ (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా ఈ అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి రెడీ అయ్యారు. అయితే గవర్నర్ ప్రసంగంలో ఈ […]

గవర్నర్ తమిళిసైతో పంతం నెగ్గించుకున్న కేసీఆర్
X

తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేయాల్సిన ప్రసంగం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని ఆమెకు పెద్ద ఇబ్బందిని నివారించారు. శుక్రవారం బడ్జెట్ సమావేశంలో మొదటి రోజు రాష్ట్ర శాసనసభలో ఈ చిత్రం చోటుచేసుకుంది.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటీజన్ (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా ఈ అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి రెడీ అయ్యారు.

అయితే గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాలు పెడితే తమిళిసై పెద్ద ఇబ్బంది పడేవారు. బీజేపీ నామినేట్ చేసిన తమిళిసై తన సొంత పార్టీకి వ్యతిరేకంగా ఈ తీర్మానాలు చదవడానికి ఒప్పుకునే వారు కాదేమో. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పెట్టే సీఏఏలను ప్రస్తావించేవారు కాకపోవచ్చు. అందుకే తెలివిగా తన పాలన, సంక్షేమంపైనే గవర్నర్ తో ప్రసంగం చదివించారు కేసీఆర్.

కేరళలో ఇలాగే బీజేపీ నియమించిన గవర్నర్ అక్కడి సీపీఎం ప్రభుత్వ ప్రసంగ పాఠం పై నిరసన తెలిపారు. చదవలేదు. అది పెద్ద వివాదం అయ్యింది. అందుకే కేసీఆర్ తమిళిసైని ఇబ్బంది పెట్టని విధంగా ప్రసంగ పాఠం రూపొందించారు.

అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఉద్రిక్తతలు పెంచే వారిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న మాటను తమిళిసైతో పలికించడం ద్వారా కేసీఆర్ తన పంతం నెగ్గించుకున్నారనే చెప్పాలి.

First Published:  7 March 2020 8:49 AM IST
Next Story