Telugu Global
National

యస్ బ్యాంకు దెబ్బ... ఫోన్ పే ఆగిపోయింది..!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. యస్ బ్యాంక్ సంక్షోభం పేమెంట్ బ్యాంక్ ‘ఫోన్ పే’ను చుట్టుకుంది. యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ దానిపై పలు ఆంక్షలు విధించింది. కాగా ఫోన్ పే చెల్లింపులకు మధ్యవర్తిగా యస్ బ్యాంకే వ్యవహరిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఫోన్ పే ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ యాప్ ద్వారా చేసే యూపీఐ చెల్లింపులు కూడా ఆగిపోయాయి. అకస్మాత్తుగా ఫోన్ పే పని చేయకపోవడంతో […]

యస్ బ్యాంకు దెబ్బ... ఫోన్ పే ఆగిపోయింది..!
X

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. యస్ బ్యాంక్ సంక్షోభం పేమెంట్ బ్యాంక్ ‘ఫోన్ పే’ను చుట్టుకుంది. యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ దానిపై పలు ఆంక్షలు విధించింది. కాగా ఫోన్ పే చెల్లింపులకు మధ్యవర్తిగా యస్ బ్యాంకే వ్యవహరిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఫోన్ పే ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ యాప్ ద్వారా చేసే యూపీఐ చెల్లింపులు కూడా ఆగిపోయాయి.

అకస్మాత్తుగా ఫోన్ పే పని చేయకపోవడంతో దాని వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ నష్టనివారణ చర్యలకు దిగాడు. దీనిపై ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని ఉంచాడు. ఫోన్ పేలో దీర్ఘకాలిక అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నామని తెలిపాడు. తమ పార్టనర్ బ్యాంక్ అయిన యస్ బ్యాంకుపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడంతోనే ఈ సమస్య ఏర్పడినట్లు చెప్పారు. త్వరలోనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు యస్ బ్యాంకుపై ఆంక్షల నేపథ్యంలో ఖాతాదారులపై కూడా తీవ్రంగా ప్రభావం పడింది. బ్యాంకు నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు కేవలం 50 వేలకు మించి డ్రా చేయకూడదని ఆంక్షలు విధించింది. తీవ్ర సంక్షోభం నేపథ్యంలో యస్ బ్యాంకు బోర్డును కూడా ఆర్బీఐ రద్దు చేసి.. ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.

First Published:  6 March 2020 8:51 AM IST
Next Story