రంజీట్రోఫీలో జయదేవ్ ఉనద్కత్ సరికొత్త రికార్డు
2020 సీజన్లో 65 వికెట్లతో అగ్రస్థానం దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో…సౌరాష్ట్ర్ర కెప్టెన్ కమ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ గత 21 సంవత్సరాల రికార్డును తెరమరుగు చేశాడు. 2019-2020 రంజీ సీజన్లో అత్యధికంగా 65 వికెట్లు పడగొట్టడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. హోంగ్రౌండ్ సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా గుజరాత్ తో ముగిసిన సెమీఫైనల్స్ రెండో ఇన్నింగ్స్ లో జయదేవ్ ఉనద్కత్ 7 వికెట్లు పడగొట్టడం ద్వారా… తన వికెట్ల సంఖ్యను 65కు పెంచుకొన్నాడు. మ్యాచ్ […]
- 2020 సీజన్లో 65 వికెట్లతో అగ్రస్థానం
దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో…సౌరాష్ట్ర్ర కెప్టెన్ కమ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ గత 21 సంవత్సరాల రికార్డును తెరమరుగు చేశాడు. 2019-2020 రంజీ సీజన్లో అత్యధికంగా 65 వికెట్లు పడగొట్టడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
హోంగ్రౌండ్ సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా గుజరాత్ తో ముగిసిన సెమీఫైనల్స్ రెండో ఇన్నింగ్స్ లో జయదేవ్ ఉనద్కత్ 7 వికెట్లు పడగొట్టడం ద్వారా… తన వికెట్ల సంఖ్యను 65కు పెంచుకొన్నాడు. మ్యాచ్ లో 142 పరుగులిచ్చి 10 వికెట్లు సాధించాడు. మార్చి 9 నుంచి జరిగే ఫైనల్లో సైతం ఉనద్కత్ మరిన్ని వికెట్లు సాధించే అవకాశం ఉంది.
1998-99 రంజీ సీజన్లో కర్ణాటక ఫాస్ట్ బౌలర్ దొడ్డా గణేశ్ అత్యధికంగా 62 వికెట్ల రికార్డు సాధించాడు. ఆ రికార్డును జయదేవ్ ఉనద్కత్ తిరగరాశాడు.
బెంగాల్ ఫాస్ట్ బౌలర్ రణదేబ్ బోస్ 57 వికెట్లు, హర్షల్ పటేల్ 52 వికెట్లతో..మూడు, నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు.