తాడిపత్రిలో జేసీ అప్పుడే జెండా దించేశారా?
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. టీడీపీలో ఒక్కో వికెట్ డౌన్ అవుతోంది. ఎన్నికల్లో తాము గెలవలేమని అస్త్ర సన్యాసాలు చేస్తున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తాజాగా చేసిన చట్టం విషయంలో టీడీపీ నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి మాటలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి… ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు జగన్ సర్కార్ కొత్తగా చట్టం చేసింది. కొత్త చట్టం ప్రకారం ఎవరైనా డబ్బు, మద్యం పంచుతూ […]
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. టీడీపీలో ఒక్కో వికెట్ డౌన్ అవుతోంది. ఎన్నికల్లో తాము గెలవలేమని అస్త్ర సన్యాసాలు చేస్తున్నారు.
స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తాజాగా చేసిన చట్టం విషయంలో టీడీపీ నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి మాటలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి… ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు జగన్ సర్కార్ కొత్తగా చట్టం చేసింది.
కొత్త చట్టం ప్రకారం ఎవరైనా డబ్బు, మద్యం పంచుతూ దొరికితే వెంటనే అరెస్టు చేస్తారు. దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తే, పంపిణీ నిజమే అని తేలితే సదరు అభ్యర్ధికి లేకపోతే నేతలకు రెండేళ్ళు జైలుశిక్ష ఖాయం. అలాగే ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా తేలుస్తారు.
కొత్త చట్టం భయంతో తమ మద్దతుదారులు ఎన్నికల్లో పోటీకి ఇష్టపడడం లేదని జేసీ అంటున్నారు. వైసీపీతో గొడవలు పడేందుకు తమ కేడర్ రెడీగా లేదనేది ఈయన వాదన. కేసులు పెట్టించుకుని జైళ్ళకు వెళ్ళేందుకు తాము సిద్ధంగా లేమని జేసి అంటున్నారు. అయితే తాడిపత్రిలో మాత్రం వేరే వర్షన్ వినిపిస్తోంది.
వైసీపీ హవాలో తాము గెలిచే పరిస్థితి లేదని…. కేడర్ మొత్తం అధికారపార్టీలో చేరిందని…. ఇప్పుడు తమ వర్గం పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదనేది టీడీపీ నేతల మాట. అందుకే కొత్త చట్టం పేరు చెప్పి జేసీ లాంటి వారు తప్పించుకోవాలని చూస్తున్నారని లోకల్ లీడర్లు అంటున్నారు.
మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్షానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. కొన్ని స్థానాలు కూడా గెలవలేకపోతే పూర్తిగా కేడర్ డీలా పడిపోయే ప్రమాదముంది. దీంతో తమ ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు నేతలను టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా రెచ్చగొడుతున్నారు. అయితే గ్రౌండ్ లెవల్ పరిస్థితి చూసిన జేసీ లాంటి లీడర్లు మాత్రం ముందే చేతులేత్తేస్తున్నారు.