మాస్క్ @ 100 ?... కరోనాతో పెరిగిన డిమాండ్
తెలంగాణలో ఒకటే ఒక కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. ఏపీలో ఇంకా వైరస్ జాడ లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో జనం అలర్ట్ అయ్యారు. కరోనా రాకుండా ఏఏ చర్యలు తీసుకోవాలని నెట్‌లో తెగ వెతుకుతున్నారు, జాగ్రత్తలు పాటిస్తున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ మైండ్ స్పేస్ సెంటర్‌లోని ఓ సాప్ట్ వేర్ కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా తేలింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో పాజిటివ్ కేసుగా తేలిందా? […]
తెలంగాణలో ఒకటే ఒక కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. ఏపీలో ఇంకా వైరస్ జాడ లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో జనం అలర్ట్ అయ్యారు. కరోనా రాకుండా ఏఏ చర్యలు తీసుకోవాలని నెట్‌లో తెగ వెతుకుతున్నారు, జాగ్రత్తలు పాటిస్తున్నారు.
హైదరాబాద్ హైటెక్ సిటీ మైండ్ స్పేస్ సెంటర్‌లోని ఓ సాప్ట్ వేర్ కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా తేలింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో పాజిటివ్ కేసుగా తేలిందా? అనే విషయం కన్‌ఫామ్ కాలేదు. కానీ మైండ్‌స్పేస్ సెంటర్‌లోని కంపెనీలకు సెలవులు ప్రకటించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్డర్స్ ఇచ్చారు.
ఇటు హైటెక్‌సిటీలో కరోనా అలజడితో ఒక్కసారిగా ప్రివెన్షన్‌పై ఉద్యోగులు ఫోకస్ పెట్టారు. మాస్క్‌లు తెగ కొంటున్నారు. బుధవారం మధ్యాహ్నం నాటికి రెండు రూపాయలు ఉండే మాస్క్ ధర ఒక్కసారిగా పెరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 40 రూపాయలు ఉండేది. రాత్రికి చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో 100 రూపాయలకు చేరింది.
ప్రతి ఆఫీసులో శానిటేజషన్‌పై కూడా దృష్టిపెట్టారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శానిటైజర్ల కోసం ఉద్యోగులు కూడా మెడికల్ షాపుల చుట్టూ తిరగడం కనిపించింది. మొత్తానికి ఒక్కసారిగా మాస్క్‌లకు గిరాకీ పెరిగింది. కొన్ని దుకాణాల్లో స్టాకులు కూడా అయిపోయాయి.